ప్రగతి జాడలేని జగన పాలన: కాలవ
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:54 PM
ముఖ్యమంత్రి వైఎస్ జగన పాలనలో అరాచకం, విధ్వంసం తప్ప అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
రాయదుర్గం, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి వైఎస్ జగన పాలనలో అరాచకం, విధ్వంసం తప్ప అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని 13వ వార్డులో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనరెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనాలు ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. బడుగు, వర్గాల ప్రజలు ఏమి తినలేని, కొనలేని దుస్థితికి వైసీపీ సర్కార్ తీసుకొచ్చింద న్నారు. జగన గెలిచాక తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలను పెంచాడన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా మూడింతలు పెరిగాయన్నారు. దుర్మార్గమైన జగనమోహనరెడ్డి పాలనను రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి టీడీపీ, జనసేన కూటమిలు అహర్నిశలు శ్రమిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, జనసేన ఇనచార్జ్ మంజునాథ, నాగరాజునాయక్, ఏటూరు కుమార్, కురుబ ప్రహ్లాద, తమ్మన్న, కురుబ హనుమంతు, ప్రశాంతి, కడ్డిపుడి మహబూబ్‌బాషా, గాజుల వెంకటేశులు, పొరాళ్ల పురుషోత్తం, బండి భారతి, కేడిమి తిప్పేస్వామి పాల్గొన్నారు.