జగనన్న రీ సర్వే రాళ్ల తొలగింపు
ABN , Publish Date - Jun 13 , 2024 | 11:52 PM
రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై సంతకం చేసిన నేప థ్యంలో జగనన్న రీ సర్వే రాళ్లును టీడీపీ నాయకుడు గోపాల్ గౌడ్ తొలగించారు
అనంతపురం అర్బన, జూన 13 : రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై సంతకం చేసిన నేప థ్యంలో జగనన్న రీ సర్వే రాళ్లును టీడీపీ నాయకుడు గోపాల్ గౌడ్ తొలగించారు. గురువారం గార్లదిన్నె మండలం కనుంపల్లిలో జగనన్న రీ సర్వే రాళ్లను ఆయన తొలగించారు. చంద్రబాబు సీఎం హోదాలో తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండోది ల్యాండ్ టైటలింగ్ యాక్టు రద్దు ఫైల్‌పై సంతకం పెట్టడం శుభపరిణామనన్నారు.