Share News

పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:12 AM

వైసీపీ పరిపాలనలో జగన్మోహన రెడ్డి పంచాయతీలను నిర్వీ ర్యం చేశాడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు.

పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన
ముస్లింలకు పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జయరాం

ఎమ్మెల్యే అభ్యర్థి జయరాం

గుంతకల్లు, ఏప్రి ల్‌17: వైసీపీ పరిపాలనలో జగన్మోహన రెడ్డి పంచాయతీలను నిర్వీ ర్యం చేశాడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. బుధవారం సాయం త్రం మండలంలోని ఎన వెంకటాంపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామీణులను కలసి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన తనకు, అంబికా లక్ష్మినారాయణకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ పల్లెల్లో కనీసం కాలువలు శుభ్రం చేయడానికి కూడా వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చి టీడీపీ చేపట్టిన నాగసముద్రం, చింతలాంపల్లి రోడ్ల పనులను ఆపించి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్న కారణంగా మరలా చేపట్టారని ఎద్దేవాచేశారు. ముష్టూరు తిమ్మప్ప, తలారి మస్తానప్ప, పత్తి హిమబిందు, రామన్న చౌదరి పాల్గొన్నారు.

టీడీపీలోకి ముస్లిం మైనార్టీలు: పట్టణంలోని 23వ వార్డులో పలువురు వైసీపీ నాయకులు, కొలిమి కార్మికులు జయరాం ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. బుధవారం ఉదయం టీడీపీ నాయకుడు గుజరీ మహమ్మద్‌ ఖాజా ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరాయి.

50 కుటుంబాల చేరిక

గుంతకల్లుటౌన: పట్టణంలోని 23వ వార్డులో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుజరిఖాజా, మాజీ కౌన్సిలర్‌ యాస్మిన సమక్షంలో 50 కుటుంబాలు బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ చేరారు.

ఎదురూరులో టీడీపీ జెండా ఎగరవేస్తాం

పామిడి: ఎదురూరు గ్రా మంలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని మాజీ మంత్రి గుమ్మనూరు జయ రాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. గ్రా మంలో బుధవారం సాయం త్రం 40 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఆయన మాట్లాడుతూ... మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గుత్తి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్‌ చౌదరి, మాజీ జడ్పీటీసీ దాసరి లక్ష్మికాంతమ్మ, బొల్లు శ్రీనివాసరెడ్డి, రామాంజనేయులు నాయక్‌, రమేష్‌ నాయక్‌, ముసలిరెడ్డి, పల్లె శ్రీనివాసులు, నారాయణస్వామి, విజయభాస్కర్‌ నాయుడు, రంగస్వామియాదవ్‌, ఆర్‌ఆర్‌ రమేష్‌, జనసేన ధనుంజయ పాల్గొన్నారు. అలాగే మండలంలోని ఎదురూరు, అక్కజాంపల్లి, గజరాంపల్లి, పొగరూరు, నీలూరు, తంబళ్లపల్లి గ్రామాల్లో బుధవారం కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్‌ జోరుగా ప్రచారం నిర్వహించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:12 AM