Share News

రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:13 AM

రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగనను సాగ నంపాలని పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు.

రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన
ప్రచారం నిర్వహిస్తున్న సవిత

సాగనంపుదాం

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన, మార్చి 25 : రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగనను సాగ నంపాలని పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. ఆమె సోమవారం పెను కొండలో అర్బనకాలనీ, ఎన్టీఆర్‌ కాలనీ, అంబేడ్కర్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, తెలు గుతల్లి సర్కిల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లా డు తూ... వైసీపీ అరాచక పాలనతో అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడు తు న్నారని అన్నారు. పోలవరం ప్రా జెక్ట్‌ పూర్తి చేయకపోవడంతో తాగు, సాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. రోడ్లు గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనంతా ఆక్రమణలు, అక్రమాలు, దౌర్జన్యా లేనని దుయ్యబ ట్టారు. ఇప్పటికైనా ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబేనని గుర్తించి ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లేదంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారమే నన్నారు. కార్యక్రమంలో సవిత భర్త వెంకటేశ్వర్‌రావు, టీడీపీ మండల మాజీ కన్వీ నర్‌ శ్రీరాములు, జిల్లా అధికార ప్రతినిధి రఘువీరచౌదరి, ఖన్నా, సుబ్రహ్మణ్యం, సామిల్‌ షౌకత, మైనార్టీ నాయకుడు దాదు, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

పెనుకొండ టౌన : ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె సోమవారం పట్టణంలోని అన్న క్యాంటిన కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ జనసేన సైనికులు, వీరమహిళలు వైసీపీ అరా చకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీమినీ మేనిఫెస్టోను, సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 21 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం లో సవిత వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. పరిగి మండలం గణపతి పల్లి, సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లి, పందిపర్తి, పెనుకొండ మండలం గొల్లపల్లి, కొనతట్టుపల్లి, రొద్దం మండలం వాసులు పార్టీలో చేరారు.

Updated Date - Mar 26 , 2024 | 12:13 AM