Share News

జగన అంటే విధ్వంసం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:57 AM

‘జగన పేరు చెబితే విధ్వంసం గుర్తుకొస్తుంది. నా పేరు చెబితే నేను చేసిన అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తుంది. నేను ఏం చేశానో చెప్పేందుకు సిద్ధం. ఈ ఐదేళ్లలో నువ్వేం చేశావో చర్చకు సిద్ధమా జగన..?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రజలను కోరారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు

జగన అంటే విధ్వంసం
కణేకల్లు ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

నా పేరు చెబితే అభివృద్ధి గుర్తుకొస్తుంది

ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి

మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది

కణేకల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రజాగళం సభకు పోటెత్తిన రాయదుర్గం ప్రజ

రాయదుర్గం/కణేకల్లు, ఏప్రిల్‌ 19: ‘జగన పేరు చెబితే విధ్వంసం గుర్తుకొస్తుంది. నా పేరు చెబితే నేను చేసిన అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తుంది. నేను ఏం చేశానో చెప్పేందుకు సిద్ధం. ఈ ఐదేళ్లలో నువ్వేం చేశావో చర్చకు సిద్ధమా జగన..?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రజలను కోరారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఎండగట్టారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని, తెచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. భారీగా తరలివచ్చిన జనం మధ్య సాగిన ఈ సమావేశం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సభ ఆద్యంతం కేరింతలు, చప్పట్లతో ఆయనకుతి మద్దతు పలికారు. కణేకల్లుక్రా్‌సలో హెలీప్యాడ్‌ వద్దకు చేరుకోగానే నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు చంద్రబాబు వాహనంలో ప్రయాణించారు. కణేకల్లు నేసేపేట రోడ్డు వద్ద నుంచి చిక్కణ్ణేశ్వరస్వామి సర్కిల్‌ వరకూ రోడ్‌షో నిర్వహించారు. చంద్రబాబుకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనానికి చంద్రబాబు అభివాదం చేస్తూ, విజయ సంకేతం చూపుతూ గంటపాటు ప్రసంగించారు. రాయలసీమలో సాగునీటి సమస్య, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. ఒక్క చాన్స పేరిట ఓట్లు తెచ్చుకున్న జగన.. అదే చివరి చాన్స అనే స్థాయికి దిగజారారని విమర్శించారు. పాఠశాల భవనాలకు రంగులు వేస్తే చదువు రాదని అన్నారు.

సమస్యలన్నీ పరిష్కరిస్తా..

గుమ్మఘట్ట మండలం గోనబావిలో బీసీ బాలికల పాఠశాలకు తన హయాంలో రూ.24 కోట్లు మంజూరు చేశానని, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పనులను ఆపేసిందని చంద్రబాబు అన్నారు. రాయదుర్గంలో బాలికల జూనియర్‌ కళాశాలకోసం రూ.52 లక్షలు ఇచ్చామని, వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా మధ్యలోనే ఆపేసిందని విమర్శించారు. కణేకల్లు మండలం మాల్యం బ్రాంచ కెనాల్‌కు 36వ ప్యాకేజీ కింద రూ.266 కోట్లు విడుదల చేశామని, జగన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అన్నారు. తద్వారా 27వేల ఎకరాలకు సాగునీరు అందకుండా పోయిందని అన్నారు. ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయదుర్గం మండలం ఆవులదట్లలో 34వ ప్యాకేజీ కింద హంద్రీనీవా పనులను కూడా పునఃప్రారంభిస్తామని అన్నారు. కణేకల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు కింద రెండు పంటలకు నీరు అందిస్తామని అన్నారు. వేదవతి హగరి నదిలో నాలుగుచోట్ల సబ్‌ సర్‌ప్లస్‌ ట్యాంకులు నిర్మిస్తామని అన్నారు. మధ్యలో నిలబడి పోయిన బీటీపీ ప్రాజెక్టు పనులను, హెచ్చెల్సీ పనులను, ఉంతకల్లు రిజర్వాయర్‌ పనులను కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సాగునీటికి హామీ

తుంగభద్ర ఎగువ కాలువ ఆధునికీకరణ, బీటీపీ పనులు, ఉంతకల్లు రిజర్వాయర్‌ పనులు కుంటుపడిన విషయాలను చంద్రబాబు ఎత్తి చూపారు. అధికారంలోకి రాగానే వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టెక్నాలజీ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ.. సెల్‌ఫోన లైట్లను ఆన చేయించి సంఘీభావం తెలపాలని కోరారు. దీంతో అందరూ సెల్‌ఫోనలో టార్చ్‌ ఆనచేసి మద్దతు తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత, నిత్యావసర ధరల పెరుగుదల గురించి చెబుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చారు. అన్న క్యాంటీనను గుర్తు చేశారు. రంజానతోఫా, దుల్హాన పథకాలతో పాటు మైనార్టీల సంక్షేమం తమతోనే అని ఆ వర్గాలకు గుర్తు చేశారు. అమ్మ ఒడి పథకాన్ని నాన్న బుడ్డీతో దోపిడీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. విధ్వంసక ర పాలన సాగిస్తున్న జగనను రక్తం తాగే జలగగా అభివర్ణించారు. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేలు పింఛన ఇస్తామని, ఇంటి వద్దకే తెచ్చిస్తామని అన్నారు. ఎనడీఏతో కలవాల్సిన అవసరాన్ని మైనార్టీలకు వివరించారు. అధికార రంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని అన్నారు. కరువు జిల్లా అనంతపై ప్రత్యేకమైన ప్రేమ ఉందని స్పష్టం చేశారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే అండ అని అన్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులకు ఆయన గట్టి హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరారు.

‘వైసీపీ ఐదేళ్ల పాలనలో మీ పొలాలకు నీళ్లు వచ్చాయా..? మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా..? మీ బిడ్డల భవిష్యత్తు కనిపిస్తోందా..? గ్రామీణ ప్రాంతాలో రోడ్లు బాగుపడ్డాయా..?’

‘తండ్రిలేని బిడ్డ అన్నాడు. ఒక్క చాన్స అన్నాడు. ముద్దులు పెట్టాడు. తల నిమిరాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దాడు’

‘ఐదేళ్ల జలగన్న పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.10 లక్షల ఆప్పు తెచ్చారు. జనం పేరుతో రూ.13 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఆ అప్పు జగన కడతాడా..? సాక్షి పేపర్‌ కడుతుందా?’

‘అధికారంలోకి రాగానే సంపద సృష్టిస్తాం... ఆదాయాన్ని పెంచుతాం.. ప్రజలకు పంచుతాం... రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీయే కూటమిదే’

- కణేకల్లు ప్రజాగళం సభలో చంద్రబాబు

Updated Date - Apr 20 , 2024 | 12:57 AM