Share News

ముస్లిం, మైనార్టీల ద్రోహి.. జగనరెడ్డి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:48 PM

ముస్లిం, మైనార్టీల ద్రోహి సీఎం జగన అని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సీఎం జగనకు వ్యతిరే కంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు

ముస్లిం, మైనార్టీల ద్రోహి.. జగనరెడ్డి
నిరసన వ్యక్తం చేస్తున్న సైఫుద్దీన, ఇతర నాయకులు

అనంతపురం అర్బన, మార్చి 1: ముస్లిం, మైనార్టీల ద్రోహి సీఎం జగన అని టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సైఫుద్దీన మండిపడ్డారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సీఎం జగనకు వ్యతిరే కంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ముస్లిం, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తీరని అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క హజ్‌ హౌస్‌ను ఏర్పా టు చేశారా అని నిలదీశారు. డంపింగ్‌ యా ర్డును తరలిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. డంపింగ్‌ యార్డు రీసైక్లింగ్‌ పేరు రూ.22 కోట్లు బిల్లులు మంజూరు చేయించుకొని, ఎన్ని టన్నుల డంపింగ్‌ను రీ సైక్లింగ్‌ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డంపింగ్‌ యార్డు తగలబడి పోవడానికి కారకులెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు ఖాజాపీరా, పీఎ భాషా, మహ్మద్‌ రఫి, పవన పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:49 PM