Share News

అమ్మఒడి పేరుతో మోసం చేసిన జగనరెడ్డి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:13 AM

అమ్మఒడి రూ.15 వేలు పేరుతో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13 వేలు వేసి మోసం చేసిన ఘనత జగనరెడ్డికి దక్కుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు.

అమ్మఒడి పేరుతో మోసం చేసిన జగనరెడ్డి
కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానిస్తున్న కాలవ శ్రీనివాసులు

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గంరూరల్‌, ఏప్రిల్‌ 17: అమ్మఒడి రూ.15 వేలు పేరుతో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13 వేలు వేసి మోసం చేసిన ఘనత జగనరెడ్డికి దక్కుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండలంలోని ఆర్‌బీవంక గ్రామంలో మండల కన్వీనర్‌ హనుమంతు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్‌బీవంక, ఆర్‌బీవంక గొల్లలదొడ్డిలో కాలవకు శాలువా, పూలమాలలతో స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జయరాంనాయక్‌, అరవింద్‌నాయక్‌, గిరిజప్ప, తమన్న, తిప్పేస్వామినాయక్‌తో పాటు పది కుటుంబాలు కాలవ శ్రీనివాసులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైకిల్‌ గాలి వీస్తోందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, నియోజకవ ర్గంలో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. హేమ్లానాయక్‌, కాటా వెంకటేశులు, రాముడు, వెంకటేశులు, మాజీ జడ్పీటీసీ విజయకుమార్‌, సిద్ధప్ప, వీరేష్‌, గిరిధర్‌నాయుడు, సోమశేఖర్‌, హనుమంతు, లచ్చన్నచౌదరి పాల్గొన్నారు.

వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలే టీడీపీ విజయానికి సోపానాలు

బొమ్మనహాళ్‌: రాష్ట్రంలో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, అక్రమాలే రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి సోపానాలని కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండలంలోని ఎల్‌బీనగర్‌ గ్రామం లో టీడీపీ నాయకుడు ముల్లంగి నారాయణస్వామి స్వగృహంలో విలేకరుల సమావేశంలో కాలవ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ విజయం ఖాయమన్నారు. ఐదు సంవత్సరాల జగనమోహనరెడ్డి విధ్వంసకర పాలనతో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు చల్లని పాలన కోసం చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు రాక యువత నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బొమ్మనహాళ్‌, డీ.హీరేహాళ్‌ మండల కన్వీనర్లు బలరాంరెడ్డి, హనుమంతరెడ్డి, క్లస్టర్‌ కన్వీనర్‌ ధనుంజయ, కొత్తపల్లి మల్లికార్జున, మల్లికార్జున, ముల్లంగి భాస్కర్‌, ఉప్పరహాళ్‌ స్వామి, పయ్యావుల మోహన, పయ్యావుల అనిల్‌, తిమ్మరాజు, సైకిల్‌షాప్‌ హనుమంతు, చలపతి, సల్లాపురం బాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:13 AM