Share News

RAIN : రెండు రోజులుగా.. విస్తారంగా వర్షాలు

ABN , Publish Date - May 19 , 2024 | 12:01 AM

మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం 4గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా మండలంలో కురుస్తు న్న భారీ వర్షాలకు పొలాల్లో నీరు పారింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలా లు దున్ని పంటలు సాగు చేసుకోవడానికి మంచి అదునుగా ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గౌనిమేకల పల్లి చెరువులోని గుంతల్లో నీరు చేరింది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభించింది.

RAIN : రెండు రోజులుగా.. విస్తారంగా వర్షాలు
Vegetable traders who are suffering due to rain in Rodham

రైతుల్లో హర్షం... ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం

రొద్దం, మే 18 : మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం 4గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా మండలంలో కురుస్తు న్న భారీ వర్షాలకు పొలాల్లో నీరు పారింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలా లు దున్ని పంటలు సాగు చేసుకోవడానికి మంచి అదునుగా ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గౌనిమేకల పల్లి చెరువులోని గుంతల్లో నీరు చేరింది. వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభించింది. మే నెలలో ఇలా భారీ వర్షాలు కురవడం చాలా అరుదని రైతులు అంటున్నారు. ఈ వర్షాల కారణంగా పశుగ్రాసం, తాగునీరు దొరుకుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.


శనివారం కురిసిన భారీ వర్షానికి కూరగాయలు తడిసి ముద్ద య్యాయి. దీంతో వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పెనుకొండ రూరల్‌ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పెనుకొండ మండలంలో రెండు రోజుల నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తు న్నాయి. మేఘాలు కమ్మేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తు త వేసవిలో ఉక్కపోతతో అల్లాడపోతున్న ప్రజలు కొంత ఉపశమనం పొందారు.


మడకశిర : నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తుండ డంతో పలు చోట్ల కుంటలు, చెక్‌డ్యామ్‌లకు నీరు చేరుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. ఖరీఫ్‌ సాగు కోసం సన్నద్ధం చేసుకుంటున్నారు. పొలాలను దుక్కులు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నా రు. నియోజకవర్గంలోని పలు మండలాలలో శుక్ర వారం ఓ మోస్తారు వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. మడకశిర మండలం లో 51.6మి.మీ, అమరాపురం మండలంలో 6.8మి.మీ లు, గుడిబండలో 12.2మి.మీ వర్ష పాతం నమో దైంది. వర్షాలు పడుతుండడంతో ఖరీఫ్‌ సాగుకు సిద్ధ అవుతున్న రైతులు ప్రభుత్వ సబ్సిడీతో అందించే వేరుశనగ విత్తన కాయల పంపిణీ కోసం ఎదురు చేస్తున్నారు. రైతులు గత యేడు అప్పులు చేసి ఖరీఫ్‌లో పంట సాగు చేశారు. అయితే తీవ్ర వర్షాభా వ పరిస్థితుల కారణంగా పంట దెబ్బతిని పూర్తిగా నష్ట పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ యేడు ఖరీఫ్‌ ప్రారంభంలోనే వర్షాలు పడు తుండడంతో పంటలు పండుతాయన్న గంపెడు ఆశతో ఖరీఫ్‌ సాగుకు సిద్ధం అవుతున్నామని పలువురు రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 19 , 2024 | 12:01 AM