Share News

24లోగా సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:44 AM

ధర్మవరం, ఫిబ్రవరి 14: సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఈనెల 24వ తేదీలోగా పరిష్కరించాలని, లేకపోతే పోరాటాలు చేస్తామని పట్టణంలోని మున్సిపల్‌ కార్మికులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం వారు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

24లోగా సమస్యలు పరిష్కరించాలి

-లేకపోతే పోరాటాలు చేస్తాం -పారిశుధ్య కార్మికుల హెచ్చరిక

ధర్మవరం, ఫిబ్రవరి 14: సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఈనెల 24వ తేదీలోగా పరిష్కరించాలని, లేకపోతే పోరాటాలు చేస్తామని పట్టణంలోని మున్సిపల్‌ కార్మికులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం వారు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల ప్రధానకార్యదర్శి అయూబ్‌ఖాన, పారిశుధ్యకార్మికసంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, ముకుంద మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఇటీవల 16 రోజులు సమ్మె చేశామన్నారు. ముఖ్యంగా వేతనం రూ.21వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఎక్స్‌గ్రేషియా, సంక్షేమపథకాల వర్తింపు, పర్మనెంట్‌ కార్మికులకు సరెండర్‌ లీవులు, పాఠశాలల ఆయాలకు బకాయిల చెల్లింపులు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18500ల జీతం చెల్లింపులు చేపట్టాలని కోరుతూ సమ్మె చేపట్టామన్నారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈనెల 24లోగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పోరాటాలు చేస్తామని తెలిపారు. అనంతరం ఈ మేరకు కమిషనర్‌ రాంకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు

పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:44 AM