Share News

ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:08 AM

నగరంలోని శ్రీనివాసా న్యూరో అండ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థిని అంకిత (17) చికిత్స పొందుతూ మృతిచెందడం వివాదాస్పదమైంది. అనంతపురం రూరల్‌ పరిధిలోని స్టాలిన నగర్‌కు చెందిన రాజు, నాగేశ్వరి దంపతుల కూతురు అంకిత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఆరు నెలలు నుంచి శ్రీనివాసా న్యూరో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.

ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థిని మృతి
మరణించిన అంకిత

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆందోళన

అనంతపురం టౌన/సెంట్రల్‌, మార్చి 15: నగరంలోని శ్రీనివాసా న్యూరో అండ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇంటర్‌ విద్యార్థిని అంకిత (17) చికిత్స పొందుతూ మృతిచెందడం వివాదాస్పదమైంది. అనంతపురం రూరల్‌ పరిధిలోని స్టాలిన నగర్‌కు చెందిన రాజు, నాగేశ్వరి దంపతుల కూతురు అంకిత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. ఆరు నెలలు నుంచి శ్రీనివాసా న్యూరో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆమెకు తలలో రక్తం గడ్డ కట్టిందని, ఇక్కడే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారని, అప్పటి నుంచి అంకితకు రెగ్యులర్‌గా ఇదే ఆస్పత్రిలోనే చికిత్స చేయిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. మూడురోజుల క్రితం పరిస్థితి విషమించడంతో అంకితను ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు గురువారం రాత్రి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ, తెల్లవారేలోగా అంకిత ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమ కూతురు రాత్రంతా ఇబ్బంది పడుతున్నా కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. వారికి మద్దతుగా విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యాం పోలీసులను ఆశ్రయించింది. వనటౌన సీఐ రెడ్డప్ప అక్కడికి చేరుకుని, బాధితులతో మాట్లాడారు. ఫిర్యాద చేస్తే కేసు నమోదు చేస్తామని నచ్చజెప్పారు. అనంతరం డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి, డెమో ఉమాపతి తదితరులు అక్కడికి చేరుకుని విచారించారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని అంకిత కుటుంబ సభ్యులు డీఎంహెచఓను కోరారు. సుమారు నాలుగు గంటలపాటు ఆందోళన కొనసాగింది. ఆ తరువాత బాధితులు ఆందోళన విరమించారు.

సీఎం జగన నిర్లక్ష్యమే కారణం

ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయకుండా సీఎం జగన నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదల ప్రాణాలను తీస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులతో కలసి శ్రీనివాస ఆస్పత్రి వద్ద ఆయన ఆందోళనకు దిగారు. ఇంటర్‌ విద్యార్థిని అంకిత ఆరునెలలుగా డాక్టర్‌ వెంకటరమణ వద్ద చికిత్స పొందుతోందని, ఆ కుటుంబం నుంచి రూ.8 లక్షలు వసూలు చేసి, చివరికి విద్యార్థి ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. విద్యార్థి మరణానికి కారణమైన ఆస్పత్రిని అధికారులు సీజ్‌ చేయాలని, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 16 , 2024 | 12:08 AM