sand dump ఇసుక డంప్ పరిశీలన
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:16 AM
మండలంలోని జుంజురంపల్లి గ్రామ సమీపంలోని వేదావతినది వద్ద గల ఇసుకరీచలో ఏర్పాటు చేసిన ఇసుక డంప్‌ను ఆర్డీఓ సుస్మితరాణి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఇసుకడం్‌పను పరిశీలించినట్లు ఆమె తెలిపారు.

రాయదుర్గం రూరల్, జూలై 7: మండలంలోని జుంజురంపల్లి గ్రామ సమీపంలోని వేదావతినది వద్ద గల ఇసుకరీచలో ఏర్పాటు చేసిన ఇసుక డంప్‌ను ఆర్డీఓ సుస్మితరాణి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఇసుకడం్‌పను పరిశీలించినట్లు ఆమె తెలిపారు.
ప్రభుత్వం ఈ నెల 8 వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుండడంతో అవసరమైన ప్రతిఒక్కరికీ ఇసుకను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. లోడింగ్‌తో పాటు ఒక టన్నుకు రూ.195 వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జుంజురంపల్లి వద్ద 58 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఓ ప్రభాకర్‌రావు, తహసీల్దార్ చిట్టిబాబు, సర్పంచ అశోక్‌కుమార్, వీఆర్వో భీమప్ప, గ్రామస్థులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...