అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన..
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:21 AM
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 5: తమసమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలకేంద్రంలో భవన కార్మికులు సోమవారం దీక్షా శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు.
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 5: తమసమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండలకేంద్రంలో భవన కార్మికులు సోమవారం దీక్షా శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంటిపట్టాలు మంజూరు చేయడంతోపాటు పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గత ఏడురోజులుగా రిలే దీక్ష చేస్తున్నామన్నారు. అయినా ఇంతవరకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదని వాపోయారు. అందుకు నిరసనగా తాము అర్థనగ్న ప్రదర్శన చేస్తున్నట్లు చెప్పారు. వీరికి సీఐటీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, కుళ్లాయప్ప మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక అధ్యక్ష, కార్యదర్శులు కేశప్ప, క్రిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.