BJP: మోదీతోనే భారతకు ప్రపంచ ఖ్యాతి: బీజేపీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:49 PM
మోదీతోనే భారతదేశానికి ప్రపంచ ఖ్యాతి లభించిందని బీజేపీ నాయకులు అన్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

హిందూపురం అర్బన, జూన 7: మోదీతోనే భారతదేశానికి ప్రపంచ ఖ్యాతి లభించిందని బీజేపీ నాయకులు అన్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణం నడిబొడ్డు అంబేడ్కర్ సర్కిల్‌లో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు రవితేజారెడ్డి అధ్యక్షతన మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రమేష్‌రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ అంజలి, నాయకులు వరప్రసాద్, భాగ్యలక్ష్మీగౌడ్, అంజనరెడ్డి, గోవిందరెడ్డి, నగేష్, నరసింహమూర్తి, హరినాథ్‌రెడ్డి, బాలగోపాల్, ఎర్రమంచి మారుతి, సంతో్‌షరెడ్డి, లక్ష్మీనారాయణ, జనార్ధన, సురేష్ అరుణ్, రవిశంఖర్, శివ, పట్టణ అధ్యక్షుడు జయకృష్ణ, దత్త, రమేష్, శ్రీనివాసులు, హనుమంతప్ప, నాగరాజు, రాముడు పాల్గొన్నారు.
పరిగిలో: ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న సందర్భంగా మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. మండల అధ్యక్షుడు బంగారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఎంపీటీసీ చంద్రశేఖర్, బైరెడ్డి, వెంకటరెడ్డి, అంజినరెడ్డి, నాగేంద్ర, శంకరప్ప, విట్టాపల్లి నాగరాజు, సంత, సంజీవమూర్తి, సాయి, మహేష్, భీమేష్, రామాంజి పాల్గొన్నారు.