Share News

హామీల అమలు.. పచ్చి అబద్ధం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:50 PM

ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగనరెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారని బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్‌ విమర్శించారు. సిద్ధం సభను.. మద్యం సభగా మార్చారని ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం మండలంలోని శ్రీహరిపురంలో వారు మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు.

హామీల అమలు.. పచ్చి అబద్ధం
మాట్లాడుతున్న కుంటిమద్ది రంగయ్య

రామగిరి, ఫిబ్రవరి 20: ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగనరెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారని బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్‌ విమర్శించారు. సిద్ధం సభను.. మద్యం సభగా మార్చారని ధ్వజమెత్తారు. మంగళవారం సాయంత్రం మండలంలోని శ్రీహరిపురంలో వారు మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మండిపడ్డారు. అన్న క్యాంటీన, చంద్రన్న బీమా తదితర 130 సంక్షేమ పథకాలు రద్దు చేసిన మహాఘనుడు జగనరెడ్డి అన్నారు. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై పెనుభారం మోపారన్నారు. తన చుట్టూ మాఫియా లీడర్లను పెట్టుకుని పరిపాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ప్రగల్బాలు పలుకుతూ అబద్దాలతో సీఎం విలువనే దిగజార్చుతున్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మజ్జిగ అశోక్‌కుమార్‌, నాగేంద్ర, కమతం కిష్టప్ప, మల్లెల ఆంజనేయులు, కుళ్లాయప్ప, తిరుపాలు, ఈశ్వరయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:50 PM