Share News

నీరు వదిలితేనే... దారి వదులుతాం

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:00 AM

నీరు వదిలితేనే తాము దారి వదులు తామని శ్రీకంఠపురం వాసులు భీష్మించారు. శ్రీకంఠపురం సర్కిల్‌లోని మహిళలు, ఆ ప్రాంత వాసులు ఆదివారం ఖాళీ బిందెలతో పట్టణంలోని హిందూపురం - లేపాక్షి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

నీరు వదిలితేనే... దారి వదులుతాం
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న శ్రీకంఠపురం వాసులు

రోడ్డుపై బైఠాయించి శ్రీకంఠపురం వాసుల నిరసన

జేసీ హామీతో విరమణ

హిందూపురం అర్బన, మార్చి 17: నీరు వదిలితేనే తాము దారి వదులు తామని శ్రీకంఠపురం వాసులు భీష్మించారు. శ్రీకంఠపురం సర్కిల్‌లోని మహిళలు, ఆ ప్రాంత వాసులు ఆదివారం ఖాళీ బిందెలతో పట్టణంలోని హిందూపురం - లేపాక్షి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... తమ ప్రాంతంలో పది రోజులుగా నీరు సక్రమంగా రావడంలేదన్నారు. మోటార్లు సరిగా పనిచేయడంలేదని వాటర్‌మెన చెబుతున్నాడన్నారు. అంతే గాకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తాం... వీలైతే పట్టుకోండి లేకుంటే మీకు ది క్కున్న చోట చెప్పుకోండని హేళనగా మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. కూలినాలి చేసుకుని జీవించే తమకు నీటిని కొనేస్థోమత లేదన్నారు. అలాగే బిందె లు మోయలేని వారిని దృష్టిలో ఉంచుకుని కొళాయి ద్వారానే నీటిని వదలాలని కోరామన్నారు. వారు రోడ్డుపై అర గంట బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. ఇదే సమయంలో హిందూపురం నుంచి లేపాక్షి వైపు వెళ్తున్న జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ రోడ్డుకు అడ్డంగా కూర్చున్న మహిళల వద్దకు వచ్చి విచారించారు. ఈ రోజే మీకు నీరు అందేలా చేస్తానని హామీ ఇవ్వడంతో శ్రీకంఠపురం వాసులు నిరసన విరమించారు. వెంటనే ముని సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంతరెడ్డి అక్కడకు చేరుకున్నారు. విష యం తెలుసుకొని వాటర్‌ ఫి ట్టర్‌, వాటర్‌మనను పిలిపించి మందలించారు. వాటర్‌ మనను వేరే ప్రాంతానికి మా ర్చాలని ఏఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగప్ప, ప్రెస్‌ వెంకటేష్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:01 AM