Share News

సీఎం మొండి వైఖరి వీడకుంటే.. ఉద్యమం మరింత ఉధృతం

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:10 AM

సీఎం జగన మొండివైఖరి వీడి.. అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద బుధవారం నిర్వహించిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు.

సీఎం మొండి వైఖరి వీడకుంటే..  ఉద్యమం మరింత ఉధృతం
కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపైనే భోజనాలు

ప్రాణత్యాగానికైనా సిద్ధం: సీఐటీయూ

37వ రోజు అంగనవాడీల నిరసన

అనంతపురం విద్య, జనవరి 17: సీఎం జగన మొండివైఖరి వీడి.. అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద బుధవారం నిర్వహించిన వంటావార్పులో ఆయన పాల్గొన్నారు. వందలాది మంది అంగన వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు మండుటెండలో రోడ్డుపై భోజనాలు చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ... ప్రభుత్వంతో ఆరుసార్లు చర్చలు జరిపామని, అయినా జీతాలు పెంచబోమని మొండిగా చెబుతోందని అన్నారు. ప్రభుత్వం తీరువల్లే అంగనవాడీలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారని అన్నారు. అంగనవాడీల సమస్యల పరిష్కారానికి ప్రాణత్యాగానికి కూడా వెనకాడబోమని ఆయన అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి తగిన సమాఽధానం చెప్పే రోజులు కూడా వచ్చాయని అన్నారు. ప్రజల మద్దతుతోనే ఉద్యమం 37 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోందని అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో అంగనవాడీ యూనియన నేతలు రమాదేవి, జమున, భారతి, అరుణ, షాహినా, మహబూబీ, సీఐటీయూ నాయకులు వెంకట నారాయణ, రామాంజినేయులు, గోపాల్‌, శివప్రసాద్‌, ఆజాం బాషా, ఆదినారాయణ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:10 AM