Share News

KALAVA: టీడీపీని గెలిపిస్తే ప్రతి మహిళకు రూ.15వేలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:14 AM

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.15వేలు అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం పట్టణంలోని 28వ వార్డులో ఆయన ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

KALAVA: టీడీపీని గెలిపిస్తే ప్రతి మహిళకు రూ.15వేలు
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కాలవ

రాయదుర్గం, ఏప్రిల్‌ 27: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.15వేలు అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం పట్టణంలోని 28వ వార్డులో ఆయన ఇంటింటికి వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ర్టానికి భవిష్యత్తు వుంటుదన్నారు.

మెట్టుకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్లే: వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి ఓటువేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని కాలవశ్రీనివాసులు ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని గుమ్మఘట్ట రోడ్డులోని తోటలో యాదవులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌ హాజరయ్యారు. కాలవ మాట్లాడుతూ మెట్టుగోవిందరెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే నేనన్నారు. యాదవులకు పదవులను ఇచ్చి రాజకీయంగా టీడీపీ వారిని ముందుకు తీసుకెళుతోందన్నారు.


22 కుటుంబాల చేరిక: మండలంలోని వేపరాల గ్రామానికి చెందిన 22 వైసీపీ కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. కృష్ణ, ప్రభాకర, వన్నూరుస్వామి, నగేష్‌, రాజు, సురేష్‌, దేవదాసు, తిప్పేస్వామి, నరసింహులు, గంగాధర, చిన్నవన్నూరప్ప, వండ్రయ్యలతో పాటు పార్టీలో చేరిన వారికి కాలవ శ్రీనివాసులు తన నివాసంలో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్యానించారు.

బటన నొక్కి.. కోట్లు దోచుకున్న జగన

బొమ్మనహాళ్‌: జగనమోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల పేరుతో బటన నొక్కి ప్రజల నుంచి కోట్లు దోచుకున్నాడని కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. శనివారం బొల్లనగుడ్డం, కళ్లుహోళ, తారకాపురం, కళ్లుదేవనహళ్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జగన పాలనలో నిత్యావసర సరుకులు, విద్యుత ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచి చెత్తపన్నులు వేసి దోచుకుంటున్నాడని విమర్శించారు.


కుటుంబీకుల ప్రచారం: కాలవ శ్రీనివాసులును గెలిపించాలని ఆయన సతీమణి విజయలక్ష్మి పట్టణంలోని 26వ వార్డులో ప్రచారం చేయగా, కుమార్తె గౌతమి కణేకల్లు మండలం కొత్తపల్లి గ్రామంలో, అల్లుడు అనిల్‌ డీ.హీరేహాళ్‌ మండలం నాగలాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తు ఓటు వే సి గెలిపించాలని అభ్యర్థించారు.

Updated Date - Apr 28 , 2024 | 12:14 AM