Share News

దండేస్తే... దాడిచేస్తారా?

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:14 AM

ఏందన్నా ఈ పని ? అందరూ ఒక ఊరి వారే కదా..! తెల్లారి లేస్తే ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాలా. ఒకరికి కష్టమొస్తే మరొకరు ఆదుకోవల్ల. అట్లాంటిది. ఎవరో రాజకీయ నాయకుల కోసం, పార్టీల కోసం గొడవ పడతారా? ఎవరి అభిమానం వారిది. ఎవరి ఇష్టం వారిది. అందరూ మీకు నచ్చినట్లు ఉండాలా? అట్టుండకపోతే దాడి చేస్తారా? ఇలాంటి సంఘటనే కొత్తచెరువు మండలం బండ్లపల్లిలో శనివారం జరిగింది.

దండేస్తే... దాడిచేస్తారా?
attack by ycp leaders

ఏందన్నా ఈ పని ? అందరూ ఒక ఊరి వారే కదా..! తెల్లారి లేస్తే ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాలా. ఒకరికి కష్టమొస్తే మరొకరు ఆదుకోవల్ల. అట్లాంటిది. ఎవరో రాజకీయ నాయకుల కోసం, పార్టీల కోసం గొడవ పడతారా? ఎవరి అభిమానం వారిది. ఎవరి ఇష్టం వారిది. అందరూ మీకు నచ్చినట్లు ఉండాలా? అట్టుండకపోతే దాడి చేస్తారా? ఇలాంటి సంఘటనే కొత్తచెరువు మండలం బండ్లపల్లిలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన అయూబ్‌ ఖాన, తన కుమార్తెతో కలిసి బండ్లపల్లి, బైరాపురం పంచాయతీలలో ప్రచారానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి పూలమాల వేశారు. ఇదే నేరమైనట్లుగా గ్రామానికే చెందిన వైసీపీ నాయకులు మున్వర్‌ బాషా, షౌకతవలీ, కురుబ మనోహర్‌, అక్బర్‌వలీ ఆయనపై దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ చెప్పు కాళ్లతో విచక్షణా రహితంగా తన్నారని బాధితుడు పేర్కొన్నారు. పోలీ్‌సస్టేషనకు వెళ్లి దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేశానన్నారు. టీడీపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. - కొత్తచెరువు

Updated Date - Apr 28 , 2024 | 12:14 AM