Share News

ROAD : చినుకు పడితే బురదమయం

ABN , Publish Date - May 17 , 2024 | 12:23 AM

వర్షం కురిస్తే చాలు మండలంలోని మట్టి రోడ్లు బురద మయం అవుతున్నాయి. మండలంలోని జమ్ములబండ నుంచి రామాయనహట్టి మీదుగా మేకులగడ్డ వరకు సుమారు 10కి.మీ. మట్టి రోడ్డు ఉంది. అలాగే కొంక ల్లు గేటు నుంచి కొంకల్లు గ్రామానికి సుమారు కిలో మీటరు, ఆదిబైరేశ్వరస్వామి దేవాలయం నుంచి సీసీగిరి గ్రామానికి వెళ్లే కిలోమీటరు మట్టి రోడ్డు ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు, వాహన దారులు వాపోతున్నారు.

ROAD : చినుకు పడితే బురదమయం
A muddy road to Ramayanahatti village

గుడిబండ, మే 16 : వర్షం కురిస్తే చాలు మండలంలోని మట్టి రోడ్లు బురద మయం అవుతున్నాయి. మండలంలోని జమ్ములబండ నుంచి రామాయనహట్టి మీదుగా మేకులగడ్డ వరకు సుమారు 10కి.మీ. మట్టి రోడ్డు ఉంది. అలాగే కొంక ల్లు గేటు నుంచి కొంకల్లు గ్రామానికి సుమారు కిలో మీటరు, ఆదిబైరేశ్వరస్వామి దేవాలయం నుంచి సీసీగిరి గ్రామానికి వెళ్లే కిలోమీటరు మట్టి రోడ్డు ఉన్నాయి.


ఈ రోడ్లలో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు, వాహన దారులు వాపోతున్నారు. మండలంలో ఆది, సోమవారా ల్లో కురిసిన వర్షాలకు ఈ రోడ్లన్నీ బురదమయమయ్యా యి. ఆ రోడ్లలో ప్రయాణించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కురిసిన వర్షానికి మట్టి రోడ్లు కోతకు గురై గుంతలు ఏర్పడుతాయి. గుంతల్లో వర్షం నీరు నిలవడం, రోడ్డంతా బురదమయం అవుతోందని అంటున్నారు. ఆ సమ యంలో ప్రయాణం నరకప్రాయంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్లు బాగు పడడం లేదన అంటున్నారు. ఈ రోడ్లపై తమ గ్రామాల వాసులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతీసుకుని మట్టిరోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


హేమావతి గ్రామంలో...

మడకశిర టౌన: అమరాపురం మండల పరిధిలోని హేమావతి గ్రామంలోని ఎస్సీ కాలనీలో వర్షం వ స్తే ప్రజలు నడిచి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై నీరు నిల్వ ఉండి, రోడ్డంతా బురదమ యంగా మారింది. గ్రామానికి చెందిన న్యాయవాది కృష్ణమూర్తి మాట్లాడుతూ సమస్య పరిష్కరించాలని ఈ ఏడాది జనవరి 8న మండలకేంద్రంలో స్పందన కార్యక్రమంలో అర్జీ అందించామని తెలిపారు. అలాగే జనవరి 22న పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో స్పందనలో అర్జీ అందించామని, సీసీ రోడ్డును ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 17 , 2024 | 12:23 AM