Share News

BK : నన్ను గెలిపిస్తే కేంద్రం నిధులు తీసుకొస్తా

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:41 AM

టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించి తనను ఢిల్లీకి పంపితే కేంద్రం నిధులు విరివిగా తీసుకొస్తానని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థ సారథి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తనకు ప్రజల అండ కావాలన్నారు.

BK : నన్ను గెలిపిస్తే కేంద్రం నిధులు తీసుకొస్తా
BK campaigned in Kakkalapally

ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే

హిందూపురం, ఏప్రిల్‌ 26 : టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించి తనను ఢిల్లీకి పంపితే కేంద్రం నిధులు విరివిగా తీసుకొస్తానని టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థ సారథి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తనకు ప్రజల అండ కావాలన్నారు.


తన హయాంలో ఉమ్మడి జిల్లాకు కియ పరిశ్రమ వచ్చిందని పెనుకొండ నియోజకవర్గానికి పలు కేంద్ర సంస్థలన తీసుకొచ్చానన్నారు. గతంలో కూడా ఎంపీగా పనిచే శానని ఆ అనుభవంతో మరిన్ని నిధులు తీసుకొస్తాన న్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో, దేశం లో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. దీనివల్ల అభివృద్ధి నిధులకు డోకా ఉండదన్నారు. కేంద్రం నుంచి వచ్చే యేయే పథకాలున్నాయో అన్నింటినీ నియోజకవ ర్గానికి తీసుకొచ్చేందుకు తన శాయశక్తులా కృషిచేస్తాన న్నారు.


ఐదేళ్ల వైసీపీపాలనతో రాష్ట్ర ప్రజలంతా విసిగి వేసారిపోయారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లే దని, దౌర్జన్యం, దందాలతో పాలన సాగుతోందన్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీడీపీ అధి కారంలోకి రాగానే ప్రవేశపెట్టే సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. ఈ పథకాలవల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండ గా ఉంటుందన్నారు. రాప్తాడు నియోజకవ ర్గంలో జరిగిన ప్రచారంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, పెనుకొండ నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 27 , 2024 | 12:41 AM