Share News

హామీలు నిలబెట్టుకున్నానన్న జగన మాట పచ్చి అబద్ధం : బీకే

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:46 PM

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నానని మేదరమెట్లలో చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసాథి విమర్శించారు.

హామీలు నిలబెట్టుకున్నానన్న  జగన మాట పచ్చి అబద్ధం : బీకే

పెనుకొండ, మార్చి 12: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నానని మేదరమెట్లలో చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసాథి విమర్శించారు. ఆయన మంగళవా రం ఓ ప్రకటన విడుదల చేశారు. జగన ఇచ్చిన హామీల్లో 85శాతం అమలు చేయ కుండా మాటతప్పి ప్రజలను మోసగించాడన్నారు. సంక్షేమానికి జగన 15శాతం మాత్రమే ఖర్చుచేయగా చంద్రబాబు 19శాతం ఖర్చుచేశారన్నారు. బాబాయిపై గొడ్డలివేటు పాపంతో పులివెందులలో ఎలా గెలుస్తాడో చూస్తామన్నారు. రూ.10లక్షల కోట్లు దోపిడీ, జిల్లాకో సొంత ప్యాలెస్‌ నిర్మాణం జగన కలలన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయినందుకే సభకు లక్ష మంది కూడా రాలేదన్నారు. తన మోసాన్ని టీడీపీకి అంటగట్టి, చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన నైజమన్నారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానని చెప్పిన జగన మాట తప్పి మడమతిప్పాడన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కోల్పోయాడన్నారు. నాశిరకం మద్యంతో 35లక్షల మంది ఆరోగ్యాన్ని నాశనం చేశాడన్నారు. దాదాపు 30వేల మంది ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అధికారంలోకి రాగానే మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తానని, సీపీ ఎస్‌ రద్దుచేస్తానని, అంగనవాడీలకు తెలంగాణకన్నా అదనంగా రూ.వెయ్యి పెం చుతానని చెప్పి మాట తప్పాడన్నారు. అలాగే విద్యుత చార్జీలు పెంచి, ఉచిత ఇసుక రద్దుచేసి రూ.50వేల కోట్ల కుంభకోణం చేశాడన్నారు. ఇలా 85శాతం హామీలు అమలు చేయకుండా మాట తప్పిన ఘనుడు జగనరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం 99శాతం హామీలు అమలు చేశామని చెప్పడం పచ్చి అబద్ధ మన్నారు. ప్రజలను మోసం చేయడానికి, మాయ చేయడానికి మేదరమెట్లకు ఆరు జిల్లాల్లోని 50నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించే ప్రయత్నం చేశాడ న్నారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాల ద్వారా వందల కోట్లు ఖర్చుపెట్టి జనాన్ని తరలించే ప్రయత్నం చేసినా సభ వెలవెలబోయిందన్నారు. అందుకే మీడియా పై ఆంక్షలు పెట్టాడన్నారు. జగనఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయమని బీకే ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 11:46 PM