Share News

health: వంద శాతం బీసీజీ వ్యాక్సినేషన చేయాలి: డీఎంహెచఓ

ABN , Publish Date - May 24 , 2024 | 12:10 AM

జిల్లాలో వందశా తం అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన చేయాలని, ఆ వ్యాక్సినతో క్షయవ్యాధి తిరిగి రాదని, శాశ్వతంగా నిర్మూలన అవుతుందని డీఎంహెచఓ డాక్టర్‌ మంజువా ణి సూచించారు.

health: వంద శాతం బీసీజీ వ్యాక్సినేషన చేయాలి: డీఎంహెచఓ

పుట్టపర్తి రూరల్‌, మే 23: జిల్లాలో వందశా తం అడల్ట్‌ బీసీజీ వ్యాక్సినేషన చేయాలని, ఆ వ్యాక్సినతో క్షయవ్యాధి తిరిగి రాదని, శాశ్వతంగా నిర్మూలన అవుతుందని డీఎంహెచఓ డాక్టర్‌ మంజువా ణి సూచించారు. మండలంలోని వెంగళమ్మచెరువు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం ఆమె టీం సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వ్యాక్సినేషనగది, ఫార్మసీ, లేబొరేటరి, కాన్పులగది, వార్డులను పరిశీలించారు.


అనంతరం కంబాలపర్తి హెల్త్‌సెంటర్‌ను సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన తీసుకోవడం వల్ల క్షయవ్యాధి తిరిగి రాదన్నారు. శాశ్వతంగా నిర్మూలన అవుతుందన్నారు. ఐదు సంవత్సరాలలో టీబీ వచ్చి తగ్గిపోయినవారు, అరవైఏళ్ల వయసు నిండిన వారు, పొగ తాగేవారు, బీఎంఐ-18 కంటే తక్కువ ఉన్నవారు, షుగ ర్‌ ఉన్నవారు, శరీర ద్రవ్యరాశి సూచిక మేరకు ఎత్తుకు తగిన బరువు లేనివారు, టీబీ రోగులతో సన్నిహితంగా ఉండేవారు తప్పకుండా అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన వేయించుకోవాలని సూచించారు. 18 ఏళ్ల వయసులోపు ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు, క్రోనిక్‌ వ్యాధులు ఉన్నవారు, హెచఐవీ రోగులు ఈవ్యాక్సిన వేసుకోరాదని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 24 , 2024 | 12:10 AM