ఇట్లైతే ఎట్లా..?
ABN , Publish Date - May 12 , 2024 | 12:45 AM
జిల్లాలో ఎన్నికల వేళ కొందరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జగన పార్టీ పట్ల స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు.

అనంతపురం విద్య, మే 11: జిల్లాలో ఎన్నికల వేళ కొందరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జగన పార్టీ పట్ల స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు. తటస్తంగా ఉండే టీచర్లు, ఇతర సిబ్బందిని ప్రలోభపెడుతున్నారు. నిబంధ నలు ఉల్లంఘించి, అధికార వైసీపీకి భజన చేస్తున్నా, ఓటర్లను ప్రలోభ పెడుతున్నా జిల్లా ఎన్నికల అధికారులుగానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
విచారణలో వైసీపీ ముద్ర ఉన్న వారే
మార్చి 31న జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ డాబాలో ఎన్నికల విందు జరిగింది. వైసీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, ఇతర అనుబంధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రలోభ పెట్టడంతో...వందలాది మంది ప్రధానో పాధ్యాయులు, టీచర్లు, అధికారులు రాజకీయ విందుకు వెళ్లారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. అయితే విచారణకు వెళ్లిన జిల్లా విద్యాశాఖాధికారులు వైసీపీకి కొమ్ము కాచే ఉపాధ్యాయుడిని, ఒక సామాజిక వర్గం టీచర్‌ను వెంటబెట్టుకుని వెళ్లారు. దీనిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ విందుకు ముందు, వెనుక ఉండి నడిపించిన వారితో అంటకాగే టీచర్‌ను విచారణ తీసుకెళితే ఇక విచారణ ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. అయితే నెలన్నర కింద జరిగిన రాజకీయ విందుకు సంబంధించి టవర్ డంప్ నివేదిక ఇవ్వాలని అధికారులు అడిగినా ఒక డీఎస్పీ అప్పట్లో బాగా అడ్డుతగిలాడన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇటీవలే ఎన్నికల కమిషన ఆదేశాల నేపథ్యంలో బదిలీ అయ్యాడు. అయితే కొత్తగా బాధ్యతలు తీసుకున్న అధికారుల ద్వారా అంుునా...టవర్ డంప్ రిపోర్ట్‌ను తెప్పిస్తారా...లేక వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
అధికారుల స్వామి భక్తి
పొలిటికల్ డిన్నర్‌లో వందలాది మంది టీచర్లను ప్రభావితం చేసి, వైసీపీకి ఓట్లు వేయాలని వంతు పాడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కొందరు సంఘాల నాయకులు ప్రత్యక్షంగా ఇందులో పాల్గొన్నారు. అయితే జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం మనకెందుకేలే అన్నట్టుగా మిన్నకుం డిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ డిన్నర్ నడిపిన నేతలను విచారణకు పిలిచి, ఏం జరగలేదన్నట్టు వాళ్లు రాసిస్తే....వీళ్లు ఫైళ్లు క్లోజ్ చేసేలా వ్యవహరిస్తుండటం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన మీటింగ్‌పై కూడా పక్కాగా సి- విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తే విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే అధికారులు తూతూ మంత్రంగా పిలిపించి మాట్లాడి, ఏం జరగలేద న్నట్టుగా రిపోర్ట్‌ను ఎన్నికల అధికారులకు పంపారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే జిల్లా విద్యాశాఖాధికారులు జగన పార్టీ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది.