ఆర్టీసీ బస్సు ఢీ.. హోంగార్డు మృతి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:43 PM
ఆర్టీసీ బస్సు ఢీ కొని హోంగార్డు దుర్మరణం చెందారు. కనగానపల్లి పోలీసులు తెలపిన వివరాల మేరకు మండలంలోని యలకుంట్ల క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది. చెన్నేకొత్తపల్లి పోలీ్‌సస్టేషనలో పనిచేస్తున్న హోంగార్డు వీ.నాగప్ప(40) సోమవారం రాత్రి మండలంలోని తూంచర్ల లో జరుగుతున్న దేవర ఉత్సవాలకు బందోబస్తుకు వెళ్లారు. విధులు ముగించుకుని తె
ఽవిధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం దర్మవరం రూరల్/ చెన్నేకొత్తపల్లి, ఫిబ్రవరి 6: ఆర్టీసీ బస్సు ఢీ కొని హోంగార్డు దుర్మరణం చెందారు. కనగానపల్లి పోలీసులు తెలపిన వివరాల మేరకు మండలంలోని యలకుంట్ల క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున జరిగింది. చెన్నేకొత్తపల్లి పోలీ్‌సస్టేషనలో పనిచేస్తున్న హోంగార్డు వీ.నాగప్ప(40) సోమవారం రాత్రి మండలంలోని తూంచర్ల లో జరుగుతున్న దేవర ఉత్సవాలకు బందోబస్తుకు వెళ్లారు. విధులు ముగించుకుని తెల్లవారుజామున తన ద్విచక్రవాహనంలో ధర్మవరం వైపు వస్తున్నారు. ధర్మవరం వైపు నుంచి వేపకుంటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు యల్లకుంట్ల క్రాస్ వద్ద ముందు వెళ్తున్న ఎద్దులబండిని తప్పించబోయి ఎదురుగా వస్తు న్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంతో పాటు బస్సుకింద పడ్డ హోంగార్డు నాగప్ప తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే కన్ను మూశారు. మృతుడికి భార్య యశోదతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుడి స్వగ్రామమైన మేడాపురం గ్రామస్థులు, బంఽధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. ఈ వి షయం తెలుసుకున్న కనగానపల్లి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగప్ప మృతిపై తోటి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
డీఎస్పీ నివాళి
హోంగార్డు అకాలంగా మృతి చెందడం బాధాకరమని ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు మృతుడి స్వగ్రామమైన మేడాపురం వెళ్లి బౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబసభ్యులకు రూ.25 వేలు ఆర్థికసాయం అందించారు. ఉన్నతాధికారుల దృష్టికితీసుకెళ్లి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారి లో ఎస్‌ఐ శ్రీదర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.