tempel :కదిరి, తాడిపత్రి ఆలయాలను సందర్శించిన హైకోర్టు జడ్జి
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:52 PM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఆమెకు తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ఈఓ, ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దారు మురళీకృష్ణ, డీఎస్పీ శ్రీలత స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో న్యాయమూర్తికి స్వాగతం పలికారు.
కదిరి లీగల్/తాడిపత్రి, ఆగస్టు 24: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఆమెకు తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ఈఓ, ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దారు మురళీకృష్ణ, డీఎస్పీ శ్రీలత స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పురోహితులు ఆలయ చరిత్రను, విశిష్ఠతను న్యాయమూర్తికి వివరించారు. స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అం దజేశారు.
ఆమె వెంట జిల్లా అదనపు న్యాయాధికారి సత్యవతి, న్యాయాధికారులు ప్రతిమ, మీనాక్షి సుందరి, కోర్టు పర్యవేక్షకులు అపర్ణ భాస్కర్ ఉన్నారు.
బుగ్గ రామలింగేశ్వరుడి సన్నిధిలో..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి, గాయత్రీదేవి అమరలింగేశ్వరస్వామి ఆలయాలు, సత్యసాయి, శివసాయి మందిరాలను హైకోర్టు జడ్జి జస్టిస్ సుజాత శనివారం సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ఆలయాల చరిత్రను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. శిల్పకల సంపదను తిలకించారు. అంతకుమునుపు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జస్టిస్ సుజాతకు స్వాగతం పలికారు. ఆమె వెంట అనంతపురం జిల్లా మొదటి అదనపు న్యాయాధికారి సత్యవతి, తాడిపత్రి జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి కృష్ణవేణి, డీఎస్పీ జనార్దననాయుడు, ఈఓ సుబ్రహ్మణ్యం, తాడిపత్రి బార్ అసోసియేషన ట్రెజరర్ శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.