Share News

మా మొర ఆలకించండి

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:06 AM

సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మెలో భాగంగా అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు 24 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మా మొర ఆలకించండి
గోరంట్లలో అంగనవాడీల నిరసన కార్యక్రమం

అంగనవాడీల వినతి 24వరోజుకు చేరిన సమ్మె

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌)

సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మెలో భాగంగా అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు 24 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గోరంట్లలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రిలేదీక్షలు గురువారం కొనసా గించారు. ప్రభుత్వం విధులకు హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసినా అంగనవాడీలు బెదరకుండా అందోళనలు నిర్వహించారు. తమపై ఆగ్రహిం చకుండా దయచేసి తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ముఖ్య మంత్రిని కోరుతూ అంగనవాడీలు చేతులెత్తి దండం పెడుతూ నిరసన తెలిపారు. మడకశిర ఐసీడీఎస్‌ కార్యాలయం ఆవరణంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు తమ పోరాటం ఆపబోమన్నారు. పెనుకొండలోని సీడీపీఓ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు, అంగనవాడీ యూనియన నాయకుల ఆధ్వర్యంలో బైటాయించి ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అలాగే హిందూపురం, సోమందేపల్లి, అగళి, గుడిబండ తదితర ప్రాంతాల్లో వారి ఆందోళన కొనసాగింది.

Updated Date - Jan 05 , 2024 | 12:06 AM