Share News

ఆస్పత్రి తీరు మారదా..?

ABN , Publish Date - May 23 , 2024 | 11:54 PM

ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందేందుకు రూ. కోట్లతో అన్ని వసతులు కల్పిస్తున్నామని ఇటుపాలకులు, అటు అదికారులు గొప్పలు చెబుతున్నారు.

ఆస్పత్రి తీరు మారదా..?

అనంతపురం టౌన, మే 23: ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందేందుకు రూ. కోట్లతో అన్ని వసతులు కల్పిస్తున్నామని ఇటుపాలకులు, అటు అదికారులు గొప్పలు చెబుతున్నారు. అయితే అనంత జిల్లా ఆసుపత్రిలో రోగులకు కష్టాలు తప్పడంలేదు. ఈ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాకే పెద్దదిక్కు. ఎలాంటి సీరియస్‌ కేసులైనా ఈ ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. అందుకు తగ్గ ట్టుగా గతంలో కన్నా ఇపుడు డాక్టర్లు, సిబ్బంది, వసతులు కూడా పెరిగాయి. ఆస్పత్రికి చికిత్సకోసం అది నడవలేనోళ్ల రోగులు పరిస్థితి కడుదయనీయంగా ఉంది. నడబలేని రోగుల సేవల కోసం ఎంఎనఓలు, ఎఫెనఓలను ప్రత్యేకంగా నియమించారు. నడవలేవని రోగులను సె్ట్రచర్లు, వీల్‌చైర్స్‌లలో సంబంధిత డాక్టర్ల వద్దకు తీసుకెళ్లడం, అనంతరం వారిని బయటకు తీసుకురావడం వారు చేయవలసిన విధులు. అయితే అనంతపరుంర పెద్దాసు పత్రిలో వీల్‌చైర్‌లు, సె్ట్రచర్లుతో పాటు ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. దీంతో నడవలేని రోగుల బంధువులే ఆస్పత్రి అంతా కలియతిరిగి సె్ట్రచర్‌ లేదా వీల్‌చైర్‌ తీసుకొచ్చి రోగులను ఆస్పత్రిలోని వార్డుల్లో డాక్టర్ల వద్దకు తీసుకెళ్తున్నారు. అవేవీ దొరకకపోతే కుటుంబ సభ్యులే రోగులను భుజంమీద లేదా వీపున ఎత్తుకొని డాక్టర్లకు చూపించేందుకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో రోగులు, వారి కుటుంబసభ్యులు ఆసుపత్రి తీరుపై నిట్టూరుస్తున్నారు.

నోరుమెదపని పర్యవేక్షణాధికారులు?

ఆస్పత్రిలో ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓలు కలిపి 120మంది వరకు ఉన్నారు. వీరందరు షిప్ట్‌ల ప్రకారం కేటాయించిన ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తూ రోగులకు సేవలందించాలి. అందు లో భాగంగా కొందరు ఎంఎనఓలు ఆస్పత్రి ద్వారం వద్ద ఉండాలి. అక్కడవరకు వచ్చిన నడవలేని రోగులను స్ర్టెచర్‌ లేదా వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టుకొని సంబంధిత వా ర్డులకు తీసికెళ్లాలి. అయితే వీరు ఆస్పత్రిలో ఎక్కడ ఉంటారో తెలియడంలేదు. డ్యూటీలో మాత్రం అందరూ ఉన్నారని అధికారులు చెబుతుంటారు. వారు ఎక్కడ ఉన్నారు? ఏమి పనిచేస్తు న్నారు అనే పర్యవేక్షణ కొరవడింది. పర్యవేక్షణకు ఒక సూపరింటెండెంట్‌, ముగ్గురు ఆర్‌ఎంఓలు, మరోఇద్దరు ఎస్‌ఆర్‌ఎంలు ఉన్నారు. వీరందరు రోజూ ఆస్పత్రికి రోజు వస్తున్నారు. రోగులు పడే బాధలు చూస్తున్నారు, కానీ ఎంఎనఓల అలసత్వంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థంకాని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా ఆస్పత్రిలో పేదరో గులకు కష్టాలు తప్పడం లేదంటూ ఆస్పత్రి నుంచి తిరిగి వెళుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 11:54 PM