SAND : ఉచిత ఇసుక విధానంపై హర్షం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:58 PM
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుపై టీడీపీ శ్రేణులు, భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి కవితా హోటల్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ చిత్రపటాలకు క్షీరాభి షేకం చేశారు.

ఉరవకొండ, జూలై8: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుపై టీడీపీ శ్రేణులు, భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి కవితా హోటల్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ చిత్రపటాలకు క్షీరాభి షేకం చేశారు. టీడీపీ నాయకులు దేవినేని పురుషోత్తం, రామాంజినేయులు, తిమ్మప్ప, నాగేశ్వరరావు. ప్యారం కేశవానంద, గోవిందు తదతరులు పాల్గొన్నారు.
బెళుగుప్ప: గత వైసీపీ ప్రభుత్వ ఇసుక విధానంతో ఎంతో మంది భవన కార్మి కులు ఉపాధి పట్టణాలకు వలసవెళ్లారని టీడీపీ నాయకులు, భవన నిర్మాణ కార్మి కులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఆవులెన్న సర్పంచ రాము, నాయకులు తగ్గుపర్తి రాజన్న, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పెద్దవడుగూరు: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ స్థానిక కార్యాలయం లో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు, తాపీమేస్త్రీలు క్షీరాభిషేకం చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....