Share News

ఘనంగా ప్రకాశం పంతులు జయంతి

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:54 AM

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జయంతిని కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ చేతన పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా ప్రకాశం పంతులు జయంతి
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌

పుట్టపర్తి, ఆగస్టు 23: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జయంతిని కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ చేతన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటీష్‌వారి తుపాకికి ఎదురునిలిచి ఆంధ్రకేసరిగా పేరొందారన్నారు. ఆం ధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా విప్లవాత్మక నిర్ణ యాల ను అమలు చేశారన్నారు. కార్యక్రమంలో ఇనచార్జి డీఆర్‌ఓ భాగ్యరేఖ, బీసీ సంక్షేమశాఖ అధికారి నిర్మలా జ్యోతి, సాంఘిక సంక్షేమశాఖ అధికారి శివరంగప్ర సాద్‌, సీపీఓ విజయ్‌కుమార్‌, డ్వామాపీడీ విజ యేం ద్రప్రసాద్‌, సీడాక్‌అధికారి ఉదయ్‌ పాల్గొన్నారు.


ధర్మవరం: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను స్థానిక గ్రంథాల యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది సత్యనారాయణ, రమణ, పాఠకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:55 AM