Share News

NBK BIRTHDAY: ఘనంగా బాలయ్య జన్మదినం

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:52 PM

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన సర్కిల్‌లో కేక్‌నుకట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

NBK BIRTHDAY: ఘనంగా బాలయ్య జన్మదినం
TDP leaders cutting cake in Puttaparthi

పుట్టపర్తి, జూన 10: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన సర్కిల్‌లో కేక్‌నుకట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు మోహననాయుడు,.నాగభూషణ, శంకర్‌, బేకరినాయుడు, కిష్టప్ప, రవి, ఆంజనేయులు, రాఘవ, రాజప్ప పాల్గొన్నారు.

ధర్మవరం: ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. 36వ వార్డులో కేక్‌ను కట్‌ చేసి పంచుకున్నారు. గోనుగుంట్ల విజయ్‌కుమార్‌, పరిశేసుధాకర్‌, ఫణికుమార్‌, మద్దిలేటి, మేకల రామాంజనేయులు, భాస్కర్‌చౌదరి, చందారాఘవ, చిన్నూరువిజయ్‌, జింకా పురుషోత్తం, మాధవరెడ్డి, అమరా సుధాకర్‌ రాయపాటిశివ పాల్గొన్నారు.


బాలయ్య ఫ్యాన్స ఆధ్వర్యంలో: బాలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలోని శివానగర్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలయ్య ఫ్యాన్స అసోషియేషన పట్టణ అధ్యక్షుడు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో చిన్నారి చేత కేక్‌కట్‌ చేసి వేడుకలను జరుపుకున్నారు.

కొత్తచెరువులో: బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. నాలుగురోడ్ల కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్‌కట్‌ చేశారు. ప్రభుత్వాస్పత్రి వద్ద అన్నదానం చేశారు. కొండప్పగారి శ్రీహరి, అవినాశ, కళాధర్‌, కల్యాణచక్రవర్తి, నవీనకుమార్‌, శ్రీహర్ష, చైతన్య, విజయ్‌, విష్ణు, రాజేశ పాల్గొన్నారు.

నల్లమాడ: బాలకృష్ణ జన్మదినాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సోమవారం స్థానిక స్వాతి క్లీనిక్‌లో నాగభూషణనాయుడు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, పంచిపెట్టారు. మండలకన్వీనర్‌ శివశంకర్‌, గనరెడ్డి, కులశేఖర్‌నాయుడు, మంజునాథ్‌రెడ్డి, పల్లపు ప్రతాప్‌, శివప్రసాద్‌రెడ్డి, హనుమంతురెడ్డి, మహబూబ్‌బాషా, సోముశేఖర్‌రెడ్డి, జనసేన అబ్దుల్‌అబూ పాల్గొన్నారు.


పుట్టపర్తి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హనుమాన సర్కిల్‌లో కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు మోహననాయుడు, నాగభూషణ, శంకర్‌, బేకరినాయుడు, కిష్టప్ప, రవి, ఆంజనేయులు, రాఘవ, రాజప్ప పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం పట్టణంలోని పీఆర్‌టీ వీధిలో మాజీ సిల్క్‌ వీవర్స్‌ సొసైటీ అధ్యక్షులు పామిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కౌన్సిలర్‌ కలమిశెట్టి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు పరిసేసుధాకర్‌, వెంకటే్‌షబాబు, బద్దెలరాము, లక్ష్మీకాంత, పామిశెట్టి చంద్రశేఖర్‌, చక్రపాణి, మాజీ కౌన్సిలర్‌ అన్నం శ్రీనివాసులు, లోకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:52 PM