Share News

టీడీపీతోనే చేనేతలకు పూర్వవైభవం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:15 AM

రాష్ట్రంలో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో కుదేలైన చేనేత రంగానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే పూర్వ వైభ వం వస్తుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు.

టీడీపీతోనే చేనేతలకు పూర్వవైభవం
పార్టీ కండువావేసి మైనార్టీలను ఆహ్వానిస్తున్న సవిత

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన(సోమందేపల్లి), ఏప్రిల్‌ 18 : రాష్ట్రంలో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో కుదేలైన చేనేత రంగానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే పూర్వ వైభ వం వస్తుందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె గురువారం సోమందేపల్లిలోని ద్వారకామయినగర్‌, స్నేహలతనగర్‌, రాంబాబుకొట్టాల కాలనీల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సూపర్‌సిక్స్‌ పథకాల ప్రాము ఖ్యతను ఆమె ప్రతి ఒక్కరికి వివరించారు. అలాగే చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉం టుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీలు సవిత సమక్షంలో టీడీపీలో చేరారు. అనం తరం ఆమె మాట్లాడుతూ సోమందేపల్లిలో చాలా మం ది చేనేత రం గంపై ఆధారపడి ఉన్నారని, అలాంటి రం గం ఈ ఐదేళ్లలో కనుమరుగైందన్నారు. వైసీపీ ప్రభు త్వం నుంచి ఆదరణలేక చేనేత కార్మికులు కూలి పను లకు వెళ్తున్నారన్నారు. కుటుంబ పోషణభారమై అప్పుల బాధ తట్టు కోలేక పలువురు మృతిచెందారన్నారు. నేత న్న నేస్తం పథకం లబ్ధి అంతంత మాత్రమే అన్నారు. ఆహారం అందించే రైతన్న దేశానికి ఎంత అవసరమో, వస్ర్తాన్ని అందించే నేతన్న అంతే అవసరమన్నారు. అగ్గిపెట్టెలో ఆరడుగుల చీర నేసి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన ఘనత మన చేనేత కళాకారులదన్నారు. ఇలాంటి పరిశ్రమ వైసీపీ తీరుతో అంధకారంలో నెట్టుకొ స్తోందన్నారు. టీడీపీ హయాంలో చేనేతలకు చంద్ర బాబు అండగా ఉండేవారని.. ముడిసరుకు, రంగులపై సబ్సిడీ ఇచ్చారన్నారు. చేనేత సహాయనిధి ద్వారా కోట్లనిధులు, మర మగ్గాలకు రాయితీ, కుటుంబాలకు వంద యూ నిట్ల ఉచిత విద్యుత, 50ఏళ్లు దాటినవారికి రూ.2వేలు పింఛన అందించారని వివరించారు. ఇలా చేనేత రం గాన్ని రక్షించింది, కార్మికులకు వ్యక్తిగతంగా ఊరటనిచ్చింది టీడీపీ యేనన్నా రు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ రద్దు చేసిందన్నా రు. రానున్నది టీడీపీ ప్రభుత్వ మని చేనేత పరిశ్రమను అన్ని వి ధాల ఆదుకుంటామన్నారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు నీరు గంటి చంద్ర, సురేష్‌, కిష్ట, డీవీ ఆంజనేయులు, కన్వీనర్‌ సిద్ద లిం గప్ప, నాగమణి, అశ్వత్థ, అనసూ యమ్మ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి 20మంది మైనార్టీలు టీడీపీలు చేరిక

గోరంట్ల: పట్టణానికి చెందిన మైనార్టీ నాయకుడు, పారిశ్రామిక వ్యాపార వేత్త వైసీపీ నాయకుడు హసేన ఖాన టీడీపీలో చేరారు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు నబీరసూల్‌, మల్లాపల్లి బాలక్రిష్ణారెడ్డితో పాటు 20మంది అనుచరులు టీడీపీలో చేరారు. వారికి స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్వీనర్‌ సోమశేఖర్‌, అశ్వత్థరెడ్డి, ఉమ్మర్‌ఖాన తదితరులున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:15 AM