Share News

చేనేత వరం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:00 PM

ధర్మవరం పేరెత్తగానే టక్కున గుర్తు వచ్చేది పట్టుచీరలు. ఇక్కడ చీరల తయారీలో కార్మికుల కళా నైపుణ్యానికి కొదవలేదు. అగ్గిపెట్టెలో ఒదిగేలా పట్టుచీరలు తయారు చేసిన నేతన్న సంపంగి, మయూరా, పద్మారవింద వంటి ఎన్నో సృజనాత్మకతతో కూడిన పట్టువస్త్రంపై తమ కళానైపుణ్యంతో మగువ మెచ్చేలా తయారు చేయడంలో ఇక్కడి నేత కార్మికుల సొంతం. ఇక్కడ తయారు చేసిన పట్టుచీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

చేనేత వరం
statue of handloom worker

ప్రపంచ ఖ్యాతిగాంచిన ధర్మవరం పట్టుపరిశ్రమ

ధర్మవరం పేరెత్తగానే టక్కున గుర్తు వచ్చేది పట్టుచీరలు. ఇక్కడ చీరల తయారీలో కార్మికుల కళా నైపుణ్యానికి కొదవలేదు. అగ్గిపెట్టెలో ఒదిగేలా పట్టుచీరలు తయారు చేసిన నేతన్న సంపంగి, మయూరా, పద్మారవింద వంటి ఎన్నో సృజనాత్మకతతో కూడిన పట్టువస్త్రంపై తమ కళానైపుణ్యంతో మగువ మెచ్చేలా తయారు చేయడంలో ఇక్కడి నేత కార్మికుల సొంతం. ఇక్కడ తయారు చేసిన పట్టుచీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పేరుకే గుర్తింపు ఉంది కానీ ఆ నేతన్నలు కడుపు మాత్రం నింపలేని పరిస్థితి పట్టుపరిశ్రమలో నెలకొంది. కనీస ధర కూడా లేకపోవడంతో నేతన్నలు పడుతున్న బాధలు వర్ణణాతీతమే. చేనేత తరువాత వ్యవసాయంపై కూడా ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఆధారపడి జీవిస్తున్నారు. నాయకులు ఈ రెండు రంగాలను పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో చెరువులు నిండినా ఆయకట్టు భూములు మాత్రం సాగులోకి రాకపోవడం ఇక్కడి రైతాంగాన్ని కుంగదీస్తోంది. గత ఏడాది నుంచి తాగునీరు కూడా ధర్మవరానికి ప్రధాన సమస్యగా మారింది. డంపింగ్‌్‌ యార్డ్‌ లేక ఎక్కడపడితే అక్కడ చెత్తను వేసే పరిస్థితి మున్సిపాలిటీలో ఏర్పడింది.


ఽశ్రీకృష్ణదేవరాయల కాలంలో సామంతరాజులుగా ఉన్న క్రియాశక్తి వడియార్‌ అప్పట్లో వర్షాలు బాగా వస్తున్నా నీరు నిల్వ ఉండేందుకు బావులు పెద్దగా లేకపోవడంతో ధర్మవరం చెరువును తవ్వించారు. చెరువుకు ఏడు మరువలు పెట్టారు. ఒకసారి భారీ వర్షం కారణంంగా ఏడు మరువలు పొంగి పొర్లుతున్నాయి. మరువలు తెగిపోతే చాలా గ్రామాల్లోని ప్రజలు నీటమునిగి పోతారని తెలుసుకున్న చెందిన ధర్మాంబ అనే మహిళ మరువ వద్ద కట్ట తెగిపోకుండా ఉండేందుకు ఆమె అడ్డంగా పడుకుని ప్రాణత్యాగం చేసింది. అప్పుడు గంగమ్మ శాంతించి మరువలు తెగిపోలేదని పురాణాలు చెబుతున్నాయి. చెరువు మరువలు తెగిపోకుండా ప్రాణత్యాగం చేసిన ధర్మాంబ అనే మహిళ పేరును పెట్టారు. కాలక్రమేనా ధర్మాంబ పేరు ధర్మవరంగా మారిందని పెద్దలు చెబుతున్నారు.


ధర్మవరం పట్టణంలో చెన్నకేశవుడి రథోత్సవాలు పది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తాడిమర్రి మండలంల మహాశివరాత్రికి చిల్లవారిపల్లి కాటకోటేశ్వరక్షేత్రంలో ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తారు. బత్తలపల్లి మండల కేంద్రంలో మొహరం వేడుకలలో భాగంగా పీర్ల స్వాముల భేటీ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారు. ముదిగుబ్బమండలంకమ్మవారిపల్లి గ్రామంలో వీరనారాయణస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.


ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగమైన ధర్మవరం మ ద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడే నియోజకవర్గంగా ఏర్పడింది. నియోజకవర్గ విస్తీర్ణం 1,33,361 హెక్టార్లు ఉండగా, 3,04706 జనాభా ఉంది. ఇందులో పురుషులు 1,55,211 మంది, మహిళలు 1,49,495 మంది ఉన్నారు. జిల్లాల పునర్విభజన తరువాత పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాగా అవతరించి ధర్మవరం నియోజకవర్గం ఆ జిల్లాలో భాగమైంది. ఇప్పటి వరకు 15 సార్లు అ సెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1951లో నియోజకవర్గం ఏ ర్పాటుకాగా 1952లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కిసాన మజ్దూర్‌ ప్రజాపార్టీ తరఫున ధర్మవరం పట్టణానికి చెందిన కాశెట్టి శ్రీనివాసులు గెలుపొందారు. ఈయన తన ప్రత్యర్తిపై 16,072 ఓట్లమెజారిటీతో గెలుపొంది మొట్టమొదటి ఎమ్మెల్యేగా సుస్థిరస్థానాన్ని పొందారు. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, జిల్లా పరిషత చైర్మన్లుగా, రాష్ట్ర మంత్రులుగా, పీసీసీచీఫ్‌, ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించిన ఘన చరిత్ర ఉంది. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన గరుడమ్మగారి నాగిరెడ్డి 30,605 ఓట్ల అత్యధిక మెజార్టీ సాధించారు. 1994లో టీడీపీ తరఫున పోటీచేసిన గుత్తా వెంకటనాయుడు 1070 అత్యల్ప మెజారిటీ సాధించారు.


ధర్మవరంలో పలు అంశాలు ఎన్నికలను ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరిపై ఎటువంటి ఇబ్బంది కల్గించిన వారి నుంచి తీవ్ర ప్రభావంచూపే అవకాశం లేకపోలేదు. రైతులకు కూడా సరైన సమయంలో సరైన సహకారం అందించకపోతే ఆ ప్రభుత్వంపై అసంతృప్తి రాగాలు పెల్లుబుకే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పింఛన్లు, రోడ్లు సమస్యలపై ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కనున్నారు. తాగు, సాగు నీరు కూడా సక్రమంగా అందించకపోతే రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా నెలకొంటుంది. ఇక్కడ ఎవరైనా కబ్జాలు, భూదందాలు, అవినీతికి పాల్పడిన ఆ పార్టీకి ఓటు బ్యాంకు రూపంలో ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది.


ధర్మవరం నియోజకవర్గం తొలి అసెంబ్లీ అభ్యర్థిగా 1952లో కిసాన మజ్దూర్‌ ప్రజాపార్టీ తరఫున పోటీ చేసిన కాశెట్టి శ్రీనివాసులు తమ సమీప ప్రత్యర్థి కాంగ్రె్‌సకు చెందిన జి.వెంకటరెడ్డిపై 16,056 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాశెట్టి శ్రీనివాసులు మగ్గం నేసుకుంటూ అప్పటి ధర్మవరం ప్రజల అభీష్టం మేరకు పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన గెలుపొందిన తరువాత తమకున్న ఆస్తులను సైతం ప్రజాఉపయోగ కార్యక్రమాలకు కేటాయించారని ఇప్పటికి స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుతం వీరి కుటుంబం మొత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లింది. మగ్గంతోపాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆయనతోనే రాజకీయాలకు స్వస్తిపలికినట్లయింది.


ధర్మవరం నియోజకవర్గం ఏర్పడిన తరువాత 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఇందులో తెలుగుదేశం ఆరుసార్లు, కాంగ్రెస్‌ ఆరుసార్లు, వైపీపీ ఒకసారి, ఇండిపెండెంట్‌ ఒకసారి, కిసాన మజ్దూర్‌ ప్రజాపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఇందులో అత్యధికం, అత్యల్ప మెజార్టీలు టీడీపీ అభ్యర్థులకే దక్కాయి. గరుడమ్మగారి నాగిరెడ్డి ఒక్కరే మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ఈయన తెలుగుపార్టీ ఆవిర్భావం నుంచి 1983 నుంచి వ రుసగా మూడు సార్లు గెలుపొం ది మంత్రిగా పనిచేశారు. ధర్మవరం చేనేత పరిశ్రమకు, నిమ్మలకుంట తోలుబొమ్మలకు ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచడం ఈ నియోజకవర్గంలో ప్రత్యేకతను చాటుకుంది.


ధర్మవరం మండలంలో నడిమిగడ్డిపల్లి, బిల్వంపల్లి, చిగిచెర్ల ఎస్సీకాలనీ, గరుడంపల్లి, సుబ్బరావుపేట, నేటకోట గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి కోసం సమీప వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. రాంపురం-ధర్మవరం, ముచ్చురామి-రేగాటిపల్లి, ధర్మవరం నుంచి తుమ్మల,తిప్పేపల్లి గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. తాడిమర్రి నుంచి ఏకపాదంపల్లి, పుల్లప్పల్లి నుంచి పిన్నధరి, దాడితోట బైపాస్‌ నుంచి నాయనపల్లి, పార్నపల్లి నుంచి తురకవారిపల్లి గ్రామాల రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. చిల్లవారిపల్లి, చిల్లకొండయ్యపల్లి, శివంపల్లి బీసీకాలనీ తాగునీటి సమస్య ఉంది. చిల్లవారిపల్లి గ్రామంలో ప్రజలు బాటమ్మగుడి వద్దకు, వ్యవసాయ పొలాల వద్దకు తాగునీటి కోసం వెళుతున్నారు. చిల్లకొండయ్యపల్లిలో ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మరోకాలనీకి వెళ్లి నీటిని తెచ్చుకుంటారు. ఈ ఏడాది చెరువులకు నీరు రాకపోవడంతో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని పాతవూరు తాగునీటి సమస్య అధికంగా ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. నల్లాయగుంటపల్లి, యాకర్లకుంటపల్లి, గుంజేపల్లి, పొడరాళ్లపల్లి, సంకేపల్లి గ్రామాల సమీపంలో వ్యవసాయ బావులకు లో ఓల్టేజ్‌ సమస్య అధికంగా ఉంది. యోగివేమన రిజర్వాయర్‌ వద్దకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉంది. టీకొట్టాలకు వెళ్లే రహదారి కూడా కంకర తేలి నడవడానికి కూడా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. బత్తలపల్లి మండలంలో అనంతసాగరం, కాటమకుంట, దంపెట్ల పంచాయతీ, పత్యాపురం, చెర్లోపల్లి గ్రామాలలో తాగునీటి సమస్య ఉంది. ఉప్పర్లపల్లి క్రాస్‌ నుంచి గరిశనపల్లివరకు రోడ్డు గుంతల మయంగా ఉండటంతో ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:00 PM