Share News

అనిల్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:33 AM

పుట్టపర్తి ఏప్రిల్‌ 5: సత్యసాయి బాబా ప్రసంగం ఆంగ్ల అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌కు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ తదితరులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు.

అనిల్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు

పుట్టపర్తి ఏప్రిల్‌ 5: సత్యసాయి బాబా ప్రసంగం ఆంగ్ల అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌కు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ తదితరులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సత్యసాయి జనరల్‌ హాస్పటల్‌లో ఉన్న అనిల్‌కుమార్‌ పార్థివ దేహాన్ని వారు సందర్శించి నివాళులర్పించారు. సత్యసాయితో, భక్తులతో సుమారు 40 ఏళ్ల పాటు ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. మా జీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా నివాళులర్పించి ఆయన సేవలు అనన్యమం టూ కొనియాడారు. తర్వాత స్థానిక అమరధామంలో దహనక్రియలు నిర్వహించారు.

Updated Date - Apr 06 , 2024 | 12:33 AM