Share News

Ground nuts: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి

ABN , Publish Date - May 22 , 2024 | 12:22 AM

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. స్థానిక ఇండసి్ట్రల్‌ ఏరియాలో ఉన్న వేరుశనగ విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌ పవన అగ్రో ఏజెన్సీని మంగళవారం ఆమె ఏడీఏ వెంకటరాముడు తో కలిసి తనిఖీ చేశారు.

Ground nuts: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి
District Agriculture Officer inspecting groundnut seed pods

గుత్తి, మే 21: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. స్థానిక ఇండసి్ట్రల్‌ ఏరియాలో ఉన్న వేరుశనగ విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌ పవన అగ్రో ఏజెన్సీని మంగళవారం ఆమె ఏడీఏ వెంకటరాముడు తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో ప్రాసెసింగ్‌ చేసిన విత్తనం, రికార్డులను తనిఖీ చేశారు. వేరుశనగ ప్రాసెసింగ్‌ చేసే విధానంను వారు పరిశీలించారు. నిల్వ ఉన్న వేరుశనగ కాయలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ ఏఓలు రాకేష్‌నాయక్‌, మెహరున్నీసా బేగం, ఏఓ ముస్తాక్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:23 AM