Share News

ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:11 AM

మడకశిర సాయినాథుడి ఆలయంలో గో పూజ నిర్వహిస్తున్న భక్తులు

ఘనంగా సంక్రాంతి వేడుకలు
మడకశిరలో ప్రత్యేక అలంకరణలో భోగి రామలింగేశ్వరస్వామి

(ఆంధ్రజ్యోతి, నూస్‌నెట్‌వర్క్‌)

సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం భోగి ప్రజలు రెండో రోజు సోమవారం సంక్రాంతిని, మూ డో రోజు మంగళవారం కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇళ్ల ముంగిట, ఆలయాల ఎదు ట రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి పూజించారు. ఆల యాల్లో అర్చకులు ప్రత్యేక పూజ లు చేశారు. మడకశిర మండలంలోని నీలకంఠాపుంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోవిందాపురం, గం గుళవాయిపాళ్యం పంచాయతీల్లోని మహిళలకు స్థానిక ఆలయం ఆవరణం లో ముగ్గులపోటీలు నిర్వహించారు. ఆలయకమిటీ చైర్మన రఘువీరారెడ్డి ఎంతో ఆసక్తితో తిలకించారు. విజేతలకు బహుమంతులు అందజేశారు. అలాగే హిందూపురం, పెనుకొం డ, అగళి, కర్ణాటకలోని పావగడ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరా లను ఘనంగా జరుపుకొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:11 AM