Share News

divotional: ఘనంగా చిన్నమ్మ ఆభరణాల ఊరేగింపు

ABN , Publish Date - May 25 , 2024 | 11:50 PM

ఓడీసీ మండలం బత్తినపల్లిలో శనివారం చిన ్నమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. గౌని వంశీయుల ఆడపడుచు, మహిమాన్విత పసిబాల చిన్నమ్మ గ్రామోత్సవం గౌని కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగింది.

divotional: ఘనంగా చిన్నమ్మ ఆభరణాల ఊరేగింపు
బత్తినపల్లిలో చిన్నమ్మ ఆభరణాల పెట్టెను ఊరేగిస్తున్న గౌని వంశీయులు

ఓబుళదేవర చెరువు/ నల్లమాడ, మే 25: ఓడీసీ మండలం బత్తినపల్లిలో శనివారం చిన ్నమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. గౌని వంశీయుల ఆడపడుచు, మహిమాన్విత పసిబాల చిన్నమ్మ గ్రామోత్సవం గౌని కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా గౌని కుటుంబ సభ్యులు ఓబులప్ప, చిన్నప్ప, కేశవతో పాటు గ్రామ పెద్దలు కలిసి పసిబాల చిన్నమ్మ ఆభరణాలను పెట్టెలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత డప్పు,వాయిద్యాల నడుమ గ్రామంలో ఆ పెట్టెను ఊరేగించారు.


భక్తులు ఆ పెట్టెకు పసుపు,కుంకుమ, పువ్వులు, కాయాకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆభరణాల పెట్టెను చిన్నమ్మ తల్లి మెట్టినిల్లు అయిన నల్లమాడ మండలం వంకరకుంట పంచాయతీ బసిరెడ్డిపల్లికి ఊరేగింపుగా చేర్చారు. చౌటకుంటపల్లి, చిల్లగోర ్లపల్లి, నల్లమాడ, కొత్తపల్లి, చెరువువాండ్లపల్లి, మీదుగా పెట్టెను ఊరేగించారు. ఆయా గ్రామాల్లోని పలువురు భక్తులు పెట్టె ఎదుట పొర్లు దండాలు పెడుతూ భక్తిని చాటుకున్నారు. అలాచేస్తే వ్యాధులు నయమవుతాయని, సంతానం లేనివారిని సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. వంకరకుంట సమీపంలోని చిన్నమ్మ తోపులో గల అమ్మవారి ఆలయంలోని మూలవిరాట్‌కు ఆదివారం రాత్రికి ఆ పెట్టెలోని ఆభరణాలను తీసి అలంకరిస్తారని, ఆ తర్వాత మూడు రోజుల పాటు జాతర వైభవంగా జరుగుందని గ్రామపెద్దలు తెలిపారు. జాతర అనంతరం ఆ ఆభరణాలను పెట్టెలో భద్రపరచి అమ్మవారి పుట్టినిల్లు అయిన బత్తినపల్లికి తిరిగి చేరుస్తామని, అంతటితో జాతర ముగుస్తుందని చెప్పారు. పెట్టె ఊరేగింపులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 25 , 2024 | 11:50 PM