DDA : రాగి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Aug 06 , 2024 | 11:55 PM
రాగిపంట సాగుచేస్తే ప్రభుత్వం విత్తనాలను అందివ్వడంతో పాటు పండిన పంటను గిట్టుబాటు ధరలు కల్పించి కోనుగోలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ డీడీఏ విద్యావతి తెలిపారు. ఆమె మంగళవారం మండలంలోని చిగిచెర్ల రైతుసేవా కేం ద్రంలో రాగిపంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీడీఏ రైతులతో మాట్లాడుతూ.... త్వరలోనే రైతులకు రాగి విత్తనాలు పంపీణీ చేస్తామని, రైతులందరూ ప్రత్యామ్నాయ పంటగా రాగి సాగుచేయాలన్నారు.
డీడీఏ విద్యావతి
ధర్మవరం రూరల్, ఆగస్టు 6: రాగిపంట సాగుచేస్తే ప్రభుత్వం విత్తనాలను అందివ్వడంతో పాటు పండిన పంటను గిట్టుబాటు ధరలు కల్పించి కోనుగోలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ డీడీఏ విద్యావతి తెలిపారు. ఆమె మంగళవారం మండలంలోని చిగిచెర్ల రైతుసేవా కేం ద్రంలో రాగిపంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీడీఏ రైతులతో మాట్లాడుతూ.... త్వరలోనే రైతులకు రాగి విత్తనాలు పంపీణీ చేస్తామని, రైతులందరూ ప్రత్యామ్నాయ పంటగా రాగి సాగుచేయాలన్నారు. పంటకు పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుందని, మంచి దిగుబడులతో లాభాలు వస్తాయన్నారు. ప్రస్తుతం రాగులకు మార్కెట్‌లో విపరీతంగా డిమాండ్ పెరిగిందని, రైతులు రాగిపంటను సాగుచేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌సీ ఏఓ అబ్దుల్‌అలీ, హార్టికల్చర్ అసిస్టెంట్ భార్గవ్, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....