Share News

tdp: చంద్రబాబుతోనే సుపరిపాలన

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:00 AM

కొత్తచెరువు, ఏప్రిల్‌ 25: చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమని, ఆయన సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తలమర్ల పంచాయతీలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని, ఎంపీగా బీకే పార్థసారఽధిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించి .. వాటి వల్ల కుటుంబంలోని అన్ని అందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే ఆ పథకాలను అమలు చేస్తారని చెప్పారు. తర్వాత మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్‌రెడ్డి బ్యాంకులు, తాగునీరు, భూ దోపిడి చేస్తూ అటు వ్యవస్థలను, ఇటు ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అవినీతి ఎమ్మెల్యేను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

 tdp: చంద్రబాబుతోనే సుపరిపాలన
తలమర్లలో ప్రచారం నిర్వహిస్తున్న పల్లె రఘునాథ రెడ్డి

- ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి

కొత్తచెరువు, ఏప్రిల్‌ 25: చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమని, ఆయన సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తలమర్ల పంచాయతీలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని, ఎంపీగా బీకే పార్థసారఽధిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించి .. వాటి వల్ల కుటుంబంలోని అన్ని అందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే ఆ పథకాలను అమలు చేస్తారని చెప్పారు. తర్వాత మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్‌రెడ్డి బ్యాంకులు, తాగునీరు, భూ దోపిడి చేస్తూ అటు వ్యవస్థలను, ఇటు ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అవినీతి ఎమ్మెల్యేను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బ్యాం కులు, ప్రజలకు అందాల్సిన సత్యసాయితాగునీటిని దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. డబ్బు కోసం సొంత పార్టీ ఎంపీపీతోనే కప్పం కట్టించుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో ఒక్క చెరువును కూడా నింపని ఎమ్మెల్యే.. ఎన్నికలు వచ్చే సరికి 193 చెరువులకు నీరందిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చేఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ ఉపేక్షించమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 26 , 2024 | 12:01 AM