Share News

JC CAMPAIN: చంద్రబాబుతోనే సుపరిపాలన: అశ్మితరెడ్డి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:22 AM

చంద్రబాబునాయుడుతోనే సుపరిపాలన సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. పట్టణంలోని కృష్ణాపురంరోడ్డులో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

JC CAMPAIN: చంద్రబాబుతోనే సుపరిపాలన: అశ్మితరెడ్డి
వృద్ధుడిని ఆప్యాయంగా పలకరిస్తున్న జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌ 27: చంద్రబాబునాయుడుతోనే సుపరిపాలన సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. పట్టణంలోని కృష్ణాపురంరోడ్డులో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. టీడీపీకి అండగా నిలబడి ఊరును బాగుచేసుకుందామని ప్రజలను అభ్యర్థించారు. జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, నాయకులు పాపిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, పవనకుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, విజ్జి, నరేంద్రనాయుడు, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు.

పెద్దవడుగూరు: వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే మండలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని జేసీ అశ్మితరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని లక్షుంపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్‌ కొండూరు కేశవరెడ్డి, సతీ్‌షరెడ్డి, రమే్‌షయాదవ్‌, ప్రసాద్‌యాదవ్‌, రామాంజులరెడ్డి పాల్గొన్నారు.


కష్టపడి పనిచేయండి: జేసీ దివాకర్‌రెడ్డి

పెద్దవడుగూరు: ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే గెలుపు మనదేనని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చింతలచెరువు గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్‌ కొండూరు కేశవరెడ్డి, గంగరాజుయాదవ్‌, ఆదిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.


జేసీ పవనరెడ్డిని కలిసిన భవన నిర్మాణ కార్మికులు

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌ 27: పట్టణంలోని కృష్ణాపురం 8వరోడ్డులో ఉన్న ప్లైవుడ్‌షాపు వద్ద టీడీపీనేత జేసీ పవనరెడ్డిని శనివారం భవన నిర్మాణ కార్మికులు కలిశారు. పవనరెడ్డిని శాలువాతో సత్కరించారు. అనంతరం భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం తమ ఉచిత పథకాలకు వాడుకొని దుర్వినియోగం చేసిందన్నారు. కార్మికుల జీవితాలు బాగుపడడానికి మేనిఫెస్టోలో పొందుపరిచేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని పవనరెడ్డిని కార్మికులు కోరారు. స్పందించిన ఆయన టీడీపీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Apr 28 , 2024 | 12:22 AM