Share News

SKU: ఎస్‌కేయూ సాఫ్ట్‌బాల్‌ జట్టుకు బంగారు పతకం

ABN , Publish Date - May 19 , 2024 | 12:08 AM

ఎస్కేయూ సాఫ్ట్‌బాల్‌ జట్టుకు బంగారు పతకం దక్కింది. బెంగళూరులో 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్‌ జట్టు ప్రాతినిధ్యం వహించింది.

SKU: ఎస్‌కేయూ సాఫ్ట్‌బాల్‌ జట్టుకు బంగారు పతకం
ఎస్‌కేయూ జట్టుకు బంగారు పతకాన్ని అందజేస్తున్న బెంగళూరు యూనివర్సిటీ అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 18: ఎస్కేయూ సాఫ్ట్‌బాల్‌ జట్టుకు బంగారు పతకం దక్కింది. బెంగళూరులో 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్‌ జట్టు ప్రాతినిధ్యం వహించింది. దేశవ్యాప్తంగా 90 యూనివర్సిటీల జట్లు పాల్గొనగా.. 43సంవత్సరాల ఎస్‌కేయూ చరిత్రలో మొట్టమొదటి సారిగా జాతీయ పోటీలలో బంగారు పతకం సాధించినట్లు సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన ఏపీ రాష్ట్ర సీఈఓ, హెడ్‌కోచ వెంకటేశులు తెలిపారు. ఇందులో ఉత్తమ ప్లేయర్లుగా జిల్లాకు చెందిన క్రీడాకారులు షేక్‌ చిన్నమస్తాన బాబు, రాంబాబు ఎంపికయ్యారు. కోచతో పాటు జట్టుకు ఎస్‌కేయూ వీసీ హుస్సేనరెడ్డి, స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ శ్రీనివాసన అభినందించారు.

Updated Date - May 19 , 2024 | 12:08 AM