Share News

రైతులపై భగవంతుడి కరుణ ఉండాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 AM

రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని అలాంటి రైతులపై ఆ భగవంతుడి కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు.

రైతులపై భగవంతుడి కరుణ ఉండాలి
ఊరేగింపులో పాల్గొన్న కాలవ శ్రీనివాసులు

మాజీ మంత్రి కాలవ

డీ.హీరేహాళ్‌, జనవరి 11: రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని అలాంటి రైతులపై ఆ భగవంతుడి కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. మూడు, నాలుగు ఏళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని, రాబోవు రోజులలో పుష్కలంగా వర్షాలు కురవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు. మండలంలోని వసగుడ్డం గ్రామంలో పవాడ పురుషుడు గాదిలింగప్ప తాత ప్రవచనాలను 15 రోజులుగా నిర్వహిస్తున్నారు. గురువారం అమావాస్య రోజు ఘనంగా గాదిలింగప్ప తాత ప్రవచన ఉత్సవాలు ముగించారు గాదిలింగప్ప తాత విగ్రహాన్ని డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రూ.5 వేలు కానుకగా కాలవ శ్రీనివాసులు అందించారు. గ్రామస్థులు కాలవ శ్రీనివాసులును ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షుడు నాగళ్లి రాజు, మాజీ ఎంపీపీ మోహనరెడ్డి పాల్గొన్నారు.

గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి: విద్యార్థులు తమ ప్రతిభతో తమ తల్లిదండ్రులకు, గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మడేనహళ్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో చదువుతున్న బసమ్మ, మీనాక్షి, సుశ్మిత, గంగమ్మ, వరలక్ష్మి, నాగరత్న, గీతాంజలి, రాధిక అనే విద్యార్థులు అఖిలభారత క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. వీరికి కాలవ శ్రీనివాసులు రూ.16 వేలు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగళ్లి రాజు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM