Share News

రంగనాథుడి వైభవం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:43 AM

బొలికొండ రంగనాథస్వామి రథోత్సవం, కల్యాణోత్సవం భక్తులను అలరించాయి. వేడుకల నేపథ్యంలో మండల పరిధిలోని తొండపాడు గ్రామం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి వారి కల్యాణాన్ని తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. అనంతరం రుద్రపారాయణ హోమం నిర్వహించి, మహామంగళ హారతులిచ్చారు.

రంగనాథుడి వైభవం
రథం లాగుతున్న భక్తులు

కన్నుల పండువగా కల్యాణం.. రథోత్సవం

భక్తులతో కిటకిటలాడిన తొండపాడు క్షేత్రం

గుత్తి రూరల్‌, ఫిబ్రవరి 24: బొలికొండ రంగనాథస్వామి రథోత్సవం, కల్యాణోత్సవం భక్తులను అలరించాయి. వేడుకల నేపథ్యంలో మండల పరిధిలోని తొండపాడు గ్రామం శనివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి వారి కల్యాణాన్ని తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. అనంతరం రుద్రపారాయణ హోమం నిర్వహించి, మహామంగళ హారతులిచ్చారు. ఆలయంలో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించి, పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథాన్ని వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత బొలికొండ రంగనాథస్వామివారి ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు. ఈఓ దేవదాసు, ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత టెంకాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి రథాన్ని జమ్మిచెట్టు వరకు రథాన్ని లాగారు. భక్తులు రథంపైకి అరటి పండ్లు, బెల్లం, తీపి బెండ్లును విసిరి మొక్కు తీర్చుకన్నారు. గాజులు అంగళ్లు, లడ్డు, చెరకు అంగళ్లు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. గుత్తి, తాడిపత్రి డిపోల నుంచి తొండపాడుకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వేడుకలలో ఆలయ అర్చకులు రవిస్వామి, చేతనవర్మ, లిఖిల్‌ వర్మ, నవీన ఉదయ్‌ పాల్గొన్నారు. సీఐలు వెంకట్రామిరెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్‌ బందోబస్తు నిర్వహించారు.

ప్రత్యేక ఆకర్షణగా ఎద్దులబండ్లు

రథోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ప్యాపిలి, మామిళ్లపల్లి, రాంపురం, జక్కసానికుంట్ల, నల్లమేకలపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఎద్దల బండ్లు, ట్రాక్టర్లలో వచ్చారు. స్వామివారి ఆలయం చుట్టూ వాటితో ప్రదక్షిణ చేశారు.

Updated Date - Feb 25 , 2024 | 12:43 AM