Share News

divotional: వైభవంగా వాసవీమాత జయంత్యుత్సవాలు

ABN , Publish Date - May 19 , 2024 | 12:39 AM

వాసవీమాత జయంత్యుత్సవాలను పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించా రు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవా లు జరిగాయి.

divotional: వైభవంగా వాసవీమాత జయంత్యుత్సవాలు
ధర్మవరంలో ప్రత్యేకాలంకరణలో వాసవీమాత

ధర్మవరం, మే 18: వాసవీమాత జయంత్యుత్సవాలను పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించా రు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ మహిళా సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవా లు జరిగాయి.


అర్చకులు ఉదయమే అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాండురంగ స్వామి ఆలయం నుంచి ఆర్యవైశ్య మహిళలు కలశాలతో ఊరేగింపుగా కన్యకాపరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ గణపతిపూజ, నవగ్రహ ఆరాధన, కలశస్థాపనపూజ నిర్వహించారు. అదేవిధంగా కుంకుమార్చన గావిస్తూ వాసవీమాత నా మాలు పఠించారు భక్తులకు అన్నదానం జరిగింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 19 , 2024 | 12:39 AM