BUSINESS MEN : అనుమతులు ఇప్పించండి
ABN , Publish Date - Jun 30 , 2024 | 12:12 AM
పట్టణంలోని పరిగి బస్టాండు ఆవరణంలో హోల్‌సేల్ వ్యాపారుల కోసం కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయాలని మునిసి పల్ కమిషనర్ శ్రీకాంతరెడ్డి వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. ఈ విషయం తెలుసుకున్న హోల్‌సేల్ వ్యాపారులు శనివారం మునిసిపల్ చైర్‌పర్సన చాంబర్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు మున్సిపల్ చైర్‌పర్సన ఇంద్రజను కలిసి మాట్లాడుతూ... తమకు అనుమతులు మంజూరు చేయిస్తామని కొంత మంది పాలకపక్ష కౌన్సిలర్లు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
లేదంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వండి
మున్సిపల్ చైర్‌పర్సనను నిలదీసిన వ్యాపారులు
హిందూపురం, జూన 29 : పట్టణంలోని పరిగి బస్టాండు ఆవరణంలో హోల్‌సేల్ వ్యాపారుల కోసం కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయాలని మునిసి పల్ కమిషనర్ శ్రీకాంతరెడ్డి వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. ఈ విషయం తెలుసుకున్న హోల్‌సేల్ వ్యాపారులు శనివారం మునిసిపల్ చైర్‌పర్సన చాంబర్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు మున్సిపల్ చైర్‌పర్సన ఇంద్రజను కలిసి మాట్లాడుతూ... తమకు అనుమతులు మంజూరు చేయిస్తామని కొంత మంది పాలకపక్ష కౌన్సిలర్లు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
అయితే తమకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడంతో పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు అక్కడ అనుమతులైనా ఇప్పించాలని లేక డబ్బులైనా తిరిగి వ్వాలని డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న మునిసిపల్ కమిషనర్ శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం బహిరంగ వేలంలో స్థలాలు దక్కించుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. అలాకాకుండా స్థలాలు అప్పగించే ప్రసక్తేలే దన్నారు. దీనిపై వ్యాపారులు మాట్లాడుతూ గతంలో బహిరంగ వేలం నిర్వహిం చకుండా స్థలాలకు అనుమతులు ఇప్పిస్తామంటూ గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులతోపాటు కౌన్సిలర్లు కొంతమొత్తాన్ని తమ వద్ద నుంచి తీసుకున్నార న్నారు. ఇప్పుడేమో ఇలా అంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతు లు ఇవ్వలేని పక్షంలో తమ నుంచి తీసుకున్న డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. ప్రతిపైసాకు సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....