Share News

ఎన్నికల సమరానికి సిద్ధంకండి : వైకుంఠం

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:58 PM

రాబోవు సార్వత్రిక ఎన్నికల సమరానికి అందరూ సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా సమష్టిగా పోరాడుదామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పిలుపునిచ్చారు.

 ఎన్నికల సమరానికి సిద్ధంకండి  : వైకుంఠం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన, మార్చి 27: రాబోవు సార్వత్రిక ఎన్నికల సమరానికి అందరూ సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా సమష్టిగా పోరాడుదామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక రాయల్‌ ఫంక్షన హాల్‌లో బుధవారం నిర్వహించిన అనంతపురం అర్బన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక నుంచి 40 రోజులపాటు నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. వైసీపీ పాలనలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మస్థైర్యంలో ముందుకు వెళ్లామన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులపై మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తనను నమ్ముకున్న వారికి ఏనాడు ద్రోహం చేయలేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారి ఇంట్లో వాడిననే భావన కలిస్తానని అన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇది ఏడో సారి అని, మంచి మెజార్టీతో గెలవడంతోపాటు పార్లమెంట్‌ స్థానాన్ని గెలిపించేలా కృషి చేయాలని అన్నారు. 2019 ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, ప్రస్తుతం వాటిని సరిచేసుకొని పనిచే యాలని అన్నారు. అనంత అర్బన సీటు తనదే.. గెలుపు తనదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ డిప్యూటీ మేయర్‌ గంపన్న, నాయకులు తలారి ఆదినారాయణ, సాలార్‌ బాషా, దేవళ్ల మురళీ, గాజుల ఆదెన్న, డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, మారుతీ కుమార్‌ గౌడ్‌, నటేష్‌ చౌదరి, తెలు గు మహిళలు స్వప్న, విజయశ్రీరెడ్డి, సంగా తేజస్విని, సరళ, జానకి, కృష్ణవేణి, హసీనా పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:58 PM