త్వరలో గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటు
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:53 PM
పట్టణ సమీపంలోని చీపులేటి వద్ద ఇండియన డిజైన గార్మెంట్స్ పరిశ్రమ త్వరలో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి తెలిపారు. శుక్రవారం ఇండియన డిజైన అధినేత సల్మాన, బెంగళూరు నుంచి పలువురు గార్మెంట్ పరిశ్రమ ప్రతినిధులతో కలిసి చీపులేటి వద్ద నిర్మించిన గార్మెంట్ పరిశ్రమను గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు.

మడకశిరటౌన, జూలై 5: పట్టణ సమీపంలోని చీపులేటి వద్ద ఇండియన డిజైన గార్మెంట్స్ పరిశ్రమ త్వరలో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి తెలిపారు. శుక్రవారం ఇండియన డిజైన అధినేత సల్మాన, బెంగళూరు నుంచి పలువురు గార్మెంట్ పరిశ్రమ ప్రతినిధులతో కలిసి చీపులేటి వద్ద నిర్మించిన గార్మెంట్ పరిశ్రమను గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మూడువేల మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఈనెల 7వతేదీన గార్మెంట్ పరిశ్రమలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న యువతీ యువకులకు సంబంధించి జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. త్వరలో తేదీ నిర్ణయించి పరిశ్రమను ప్రారంభిస్తామని ఆయన అన్నారు.