Share News

చెత్తాచెదారం తొలగింపు చర్యలేవీ..?

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:15 AM

మీ సమస్యలు, మీ కష్టం కళ్లార చూశాను. వైసీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య సిబ్బందిని పర్మినెంట్‌ చేస్తామని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన వాగ్దానం చేశారు.

చెత్తాచెదారం తొలగింపు చర్యలేవీ..?
శ్రీకంఠపురం ప్రధాన రహదారిలో పేరుకుపోయిన చెత్త

సమ్మెలోనే మున్సిపల్‌ కార్మికులు

పురంలో ఎటుచూసినా చెత్త కుప్పలే

హిందూపురం, జనవరి 4: మీ సమస్యలు, మీ కష్టం కళ్లార చూశాను. వైసీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య సిబ్బందిని పర్మినెంట్‌ చేస్తామని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన వాగ్దానం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా కాంట్రాక్ట్‌ కార్మికుల జీవితాల్లో వెలుగులు రాలేదు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని వారు ఎన్ని సార్లు వేడుకున్న ఫలించలేదు. ఇక చేసేది లేక వారు సమ్మె బాట పట్టారు. వారం రోజులుగా సమ్మెలో ఉండటంతో పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు వారం దాటినా సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినా వారు తమ డిమాం డ్లపై వెనక్కులేదు. రోజూ నిరసనా శిబిరాల్లో పాల్గొంటున్నారు.

పేరుకుపోయిన చెత్త: హిందూపురం పట్టణంలో 38 వార్డులు ఉన్నా యి. ప్రధానంగా పట్టణంలో వందలాది దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తు న్నారు. వాటి నుంచి నిత్యం టన్నుల కొద్దీ చెత్త రోడ్డుపై పడుతుంటుంది. పారిశుఽధ్య కార్మికులు రాత్రి పూట శుభ్రం చేస్తుండడంతో పగులు ఎక్కడా చెత్త కనిపించేది కాదు. కానీ వారు సమ్మెలో ఉండిపోవడంతో డస్టు బినలు నిండిపోతున్నాయి. రోడ్డుపై చెత్త పడుతోంది. రెగ్యులర్‌ కార్మికులు చెత్తను తరలించేందుకు ప్రయత్నించినా కాంట్రాక్ట్‌ కార్మికులు అడ్డుకుంటున్నారు. దీని వలన మరింత చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది.

నేడు పోలీసుల ఆధ్వర్యంలో తరలింపు : కమిషనర్‌

పట్టణంలో పారిశుధ్య ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడం పట్ల పట్టణ ప్రజల నుంచి తీవ్ర వివర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చేసేది లేక శుక్ర వారం ఉదయం పోలీసుల బందోబస్తుతో చెత్త తరలింపునకు శ్రీకారం చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. దీనిపై గురువారం ఒనటౌన పోలీస్టేషనలో పోలీసు అధికారులతో ఆయన సమా వేశమయ్యారు. పారిశుధ్య పనులకు సహకరించాలని కోరారు. రెగ్యులర్‌ కార్మికులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

మడకశిరటౌన: మున్సిపల్‌ కార్మికుల సమ్మెతో పది రోజులుగా మడకశి ర పట్టణంలో ఎక్కడ పడితే అక్కడే చెత్త పేరుకుపోయింది. ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో పట్టణంలోని 20 వార్డుల పరిధిలోని కాలనీల్లో చెత్తా చెదారం తొలగించక పోవడం, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద అధికమవుతోందని పట్టణ వాసు లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులైన అమరాపురం రోడ్డు, హిందూ పురం రోడ్డు, పావగడ రోడ్డు, రాజీవ్‌గాంధీ సర్కిల్‌ ఇలా అన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో వారపు సంత కారణం గా పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రత నెలకొంది. ఇప్పటికైనా అధికారులు చెత్తాచెదారం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:15 AM