Share News

ఆట.. రోజూ కొట్లాట..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:48 AM

‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల్లో వివాదాలు, గొడవలు కొనసాగుతున్నాయి. ఎన్నికలవేళ యువతను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీలు గొడవలకు దారితీస్తున్నాయి. జేఎనటీయూ క్రీడా మైదానంలో గురువారం శింగనమల, అనంతపురం నియోజకవర్గాల జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్‌ మ్యాచపై వివాదం తలెత్తింది.

ఆట.. రోజూ కొట్లాట..!
అధికారులను ప్రశ్నిస్తున్న కీడ్రాకారులు

అనంత నియోజకవర్గ జట్టులో స్థానికేతరులు

అభ్యంతరం తెలిపిన శింగనమల క్రికెట్‌ జట్టు

జేఎనటీయూ మైదానంలో క్రీడాకారుల నిరసన

నిబంధనలపై అధికారులలో భిన్న స్వరాలు

డిప్యూటీ మేయర్‌ కోగటం జోక్యంతో ఆగిన ఆట

అనంతపురం సెంట్రల్‌, ఫిబ్రవరి 1: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల్లో వివాదాలు, గొడవలు కొనసాగుతున్నాయి. ఎన్నికలవేళ యువతను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీలు గొడవలకు దారితీస్తున్నాయి. జేఎనటీయూ క్రీడా మైదానంలో గురువారం శింగనమల, అనంతపురం నియోజకవర్గాల జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్‌ మ్యాచపై వివాదం తలెత్తింది. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో అనంతపురం జట్టు నిబంధనలకు విరుద్ధంగా ఇతర క్రీడాకారులతో వచ్చిందని ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు అభ్యంతరం తెలిపారు. సచివాలయ పరిధిలో ఉంటున్న క్రీడాకారులే జట్టులో ఉండాలన్న నిబంధనను అనంత జట్టు పాటించలేదని శింగనమల జట్టు వాదించింది. ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు డీఎ్‌సడీఓ, రాష్ట్ర ఐటీశాఖ అధికారికి పీఈటీలు ఫోన చేశారు. సచివాలయ పరిధిలో నివాసమున్న వారే పోటీలో పాల్గొనాలని డీఎ్‌సడీఓ సమాధానమివ్వగా, ఏ ప్రాంతంవారైనా పాల్గొనవచ్చని ఐటీశాఖ అధికారి జవాబిచ్చారు. అధికారులకే స్పష్టత లేకపోవడంతో వివాదం ముదిరి.. ఆట నిలిచిపోయింది.

పూటకొక నిబంధనా..?

ఒక్కో సచివాలయానికి ఒక్కో జట్టు ఉండేలా పోటీలను ప్రారంభించారు. ఆ తరువాత పోటీ పోటీకీ నిబంధనలను మార్చారు. ఇదేం తీరు అని శింగమనల జట్టు సభ్యులు ప్రశ్నించారు. పద్ధతిగా ఆడితే పాల్గొంటామని, లేదంటే వెళ్లిపోతామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌ రెడ్డి అక్కడికి చేరుకుని, డీఎ్‌సడీఓకు ఫోనచేశారు. సచివాలయ పరిధిలోని వారు మాత్రమే ఆడాలని దీఎ్‌సడీఓ ఆయనతో అన్నారు. అలా అని ఆర్డర్‌ ఇవ్వాలని కోగటం డిమాండ్‌ చేశారు. ‘అందరూ ఎలా వచ్చారో నాకు తెలుసు. ఆడించింది నువ్వే. నువ్వే నిబంధనలు పాటించలేదు కదా..? ఆర్డర్‌ ఇస్తే నీపై కేసు వేస్తాను. నీకు శిక్ష తప్పదు..’ అని డీఎ్‌సడీఓను హెచ్చరించారు. దీంతో తానే అక్కడికి వస్తానని డీఎ్‌సడీఓ బదులిచ్చారు.

స్వరం మార్చిన డీఎ్‌సడీఓ

డిప్యూటీ మేయర్‌ ఫోనకాల్‌తో జేఎనటీయూ క్రీడామైదానికి చేరుకున్న డీఎ్‌సడీఓ, తన స్వరాన్ని మార్చారు. ఏ ప్రాంతానికి చెందినవారైనా, ఒక సచివాలయంలో మ్యాపింగ్‌ చేసుకున్నాక ఆ సచివాలయ జట్టులో ఆడటానికి అర్హులని అన్నారు. దీంతో అవాక్కయిన శింగనమల జట్టు క్రీడాకారులు.. ఈ తొండి ఆటను ఆడేదిలేదని అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో జేఎనటీయూ మైదానంలో ఉరవకొండ-రాయదుర్గం, కళ్యాణదుర్గం-తాడిపత్రి. గుంతకల్లు-రాప్తాడు జట్ల మధ్య పోటీలు కూడా ఆలస్యమయ్యాయి. ఆయా జట్ల పీఈటీలు సర్దిచెప్పి మధ్యాహ్నం నుంచి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో కళ్యాణదుర్గం, గుంతకల్లు జట్లు విజయం సాధించాయి. సాయంత్రం కావడంతో ఉరవకొండ-రాయదుర్గం జట్ల మధ్య పోటీని శుక్రవారానికి వాయిదా వేశారు. అనంతపురం, శింగనమల జట్లు మధ్యాహ్నమే వెనుదిరాగాయి.

రాజకీయ క్రీడ

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు రాజకీయాలకు వేదికగా మారాయని శింగనమల జట్టు మండిపడింది. డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌ తన కుమారుడి జట్టు గెలుపుకోసం రెవెన్యూ కాలనీ పరిధిలో లేని వారిని జట్టుగా ఏర్పాటుచేశారని వారు ఆరోపించారు. పోటీ జరగకపోయినా, అనంతపురం నియోజకవర్గ జట్టును విజేతగా ప్రకటించుకున్నారని విమర్శించింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెవెన్యూ కాలనీ సచివాలయ పరిధిలో నివాసం ఉన్నారని, మిగిలిన సభ్యులు నిపుణులైన ఆటగాళ్లని, వారిని వేర్వేరు ప్రాంతాల నుంచి జట్టులోకి తెచ్చి రాజకీయం చేస్తున్నారని శింగనమల జట్టు సభ్యులు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆడటానికి తాము అంగీకరించలేదని, దీంతో వారే గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Feb 02 , 2024 | 12:48 AM