Share News

Free DSC coaching 25 నుంచి ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌: ఎమ్మెల్యే కాలవ

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:49 AM

డీఎస్సీ, టెట్‌ అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పట్టణంలోని టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో ఉచితంగా కోచింగ్‌ను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

Free DSC coaching 25 నుంచి ఉచితంగా డీఎస్సీ కోచింగ్‌: ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం, ఆగస్టు 20: డీఎస్సీ, టెట్‌ అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి పట్టణంలోని టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో ఉచితంగా కోచింగ్‌ను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.


కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో 16వేల పైచిలుకు పోస్టులు భర్తీ కానున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డీఎస్సీ అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనే ఆకాంక్షతో ఈ ఉచిత కోచింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం కాబట్టి నిరుపేద కుటుంబాల అభ్యర్థులు సుదూరప్రాంతాలకు వెళ్లి ఖరీదైన కోచింగ్‌ను తీసుకోవడం సాధ్యం కాదన్నారు. కనుక ఇక్కడే వారి కోసం టెట్‌, డీఎస్సీ కోచింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం పొందిన 12 మంది ట్రైనర్లను కోచింగ్‌ కోసం రప్పిస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 353 మంది అభ్యర్థులు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాయదుర్గం పట్టణం నుంచి 117 మంది, రాయదుర్గం మండలం నుంచి 54 మంది, కణేకల్లు మండలం నుంచి 26 మంది, గుమ్మఘట్ట మండల నుంచి 56 మంది, డీ.హీరేహాళ్‌ మండలం నుంచి 29 మంది, బొమ్మనహాళ్‌ మండలం నుంచి 11 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 25వ తేదీన ఉదయం 10 గంటలకు కోచింగ్‌ ప్రారంభించనున్నామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది ఉపాధ్యాయ పోస్టులను పొందాలని ఆయన ఆకాంక్షించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 21 , 2024 | 07:13 AM