Share News

trai cycles: మూడేళ్లుగా.. మూలకు

ABN , Publish Date - May 20 , 2024 | 12:31 AM

కొత్తచెరువు మేజర్‌ గ్రామ పంచాయతీలో చెత్తను తరలించే ట్రైసైకిళ్లు మూలన పడి తుప్పు పడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రభుత్వం పంచాయతీలోని వార్డులలో చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు వీటిని పంచాయతీ కార్మికులకు అందజేసింది.

trai cycles: మూడేళ్లుగా.. మూలకు
నిరుపయోగంగా ట్రైసైకిళ్లు

-తుప్పు పడుతున్నా పట్టించుకోని పంచాయతీ అధికారులు

కొత్తచెరువు, మే 19: కొత్తచెరువు మేజర్‌ గ్రామ పంచాయతీలో చెత్తను తరలించే ట్రైసైకిళ్లు మూలన పడి తుప్పు పడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రభుత్వం పంచాయతీలోని వార్డులలో చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు వీటిని పంచాయతీ కార్మికులకు అందజేసింది.


అయితే వైసీపీ ప్రభుత్వం చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకురాలేదు. దీంతో ట్రైసైకిళ్లను వినియోగించుకోకుండా పంచాయతీ అధికారులు మార్కెట్‌లోని ఒక మూలన పడేశారు. దీంతో అవి ఎండ కు ఎండి, వానకు తడిసి తప్పు పడుతున్నాయి. వాటిని చూసి కూడా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు విలువ చేసే ట్రైసైకిళ్లు ఇలా తుప్పుపడుతుంటే పంచాయతీ అధికారులు, పాలకులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వాటిని వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 20 , 2024 | 12:31 AM